Begin typing your search above and press return to search.

హాట్ బ్యూటీ రెజినా కుంగిపోతుంది అందుకేనట..!

By:  Tupaki Desk   |   19 March 2020 10:30 AM GMT
హాట్ బ్యూటీ రెజినా కుంగిపోతుంది అందుకేనట..!
X
రెజినా.. ఈ పేరు వింటే రాజారాణి సినిమా గుర్తొస్తుందా..! ఆ రెజినా కాదండి. రెజినా కెసెండ్రా. తెలుగుతెరకు సుపరిచితురాలైన ఈ హీరోయిన్ గత కొంతకాలంగా తెరమీద కన్పించడం లేదు. కేరీర్ మంచి ఊపులో ఉన్నప్పుడు తన అందాలతో కుర్రకారు మనసు దోచుకున్న ఈ భామ 15ఏళ్ల వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదట తమిళంలో అరంగేట్రం చేసిన రెజినా అనంతరం తెలుగులో బాగా బిజీ అయిపోయింది. ప్రస్తుతం కూడా బిజీగానే ఉన్న అంటున్న ఈ చెన్నై బ్యూటీ సోషల్ మీడియాలో అరుదుగా కన్పిస్తుంది.

యంగ్ హీరోయిన్స్ అంతా యో వాట్స్ అప్, పేస్బుక్, ఇంస్టా, ట్విట్టర్ అంటూ దూసుకుపోతుంటే రెజినా మాత్రం సోషల్ మీడియాకు దూరం అంటుంది. ఎందుకు అని అడిగితే ఇలా చెప్పుకొస్తుంది. సోషల్ మీడియా లేని రోజుల్లో హీరో హీరోయిన్లు పాపులర్ కాలేదా.. అభిమానులతో కాంటాక్టులో ఉందాలేదా.. అని అడుగుతుంది. ఎల్లప్పుడూ అందాల ఆరబోతలో ముందుండే రెజినా సోషల్ మీడియాలో కనిపించకపోతే అభిమానులు అల్లాడిపోతున్నారట.

దీనిపై రెజినా మాట్లాడుతూ.. అభిమానులతో అటాచ్ మెంట్ ఏర్పరచుకోవాలి అని అందరి హీరోయిన్లలాగే నాకు కూడా ఉంది. కానీ నేను చిన్న చిన్న కామెంట్లకు కూడా కుంగిపోతాను అంటుంది. నేను ఫొటోస్ అప్లోడ్ చేస్తే లైక్ చేసేవాళ్ళు లక్షల్లో ఉన్నా కామెంట్లు చూస్తే బాధేస్తుందని, అందుకే ఫొటోస్ పోస్టు చేయడం ఎందుకు తర్వాత బాధపడటం ఎందుకని సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆచార్య సినిమాలో ఐటెం సాంగ్ తో పాటు కొన్ని సినిమాలతో బిజీ కానున్నట్లు సమాధానమిచ్చింది రెజినా సుందరి.