Begin typing your search above and press return to search.

అయ్యో రెజీనా.. డ్రస్సు మోసం చేసింది

By:  Tupaki Desk   |   19 Aug 2016 7:45 AM GMT
అయ్యో రెజీనా.. డ్రస్సు మోసం చేసింది
X
బాలీవుడ్ లో అడుగుపెడుతున్న ఆనందంలో హీరోయిన్ రెజీనా కసాండ్రా మొన్న స్టేజీ మీద కాస్త రెచ్చిపోయిందనే చెప్పాలి. బుధవారం సాయంత్రం ముంబయ్ లో 'ఆంఖేన్ 2' సినిమా ఎనౌన్స్ మెంట్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో మా హీరోయిన్ అంటూ రెజీనా ను చాలా గ్రాండుగా ఒక డ్యాన్సు బిట్ తో లాంచ్ చేశారులే . అమ్మడు కూడా సెక్సీ బ్లాక్ బట్టల్లో తుప్పులేపేసింది. కాని అక్కడే ఆ డ్రస్సుమోసం చేసింది.

చాలా టైట్ గా ఉన్న ఔట్ ఫిట్ మాత్రమే కాదు రెజీనా వేసుకుంది.. ఆది చాలా కురచగా ఉంది కూడా. దానితో ఆమె డ్యాన్సు చేస్తున్నప్పుడు వెంటనే ఆ డ్రస్సు ఉండాల్సిన చోట ఉండకుండా స్లిప్ అయ్యింది. ఆ విషయం వెంటనే అందరూ నోటీస్ చేశారు. రెజీనా కూడా నోటీస్ చేసింది. కాకపోతే డ్యాన్సు ఆపేస్తే బాగోదు కాబట్టి.. అలాగే డ్యాన్సు కానిచ్చేసి స్టేజ్ దిగేసింది అమ్మడు. ఆ ప్రొఫెషనాల్టీని ఎప్రిషియేట్ చేయాల్సిందే. కాని మన ఫోటోగ్రాఫర్లు ఆ వార్డరోబ్ మాల్ ఫంక్షన్ ను వెంటనే క్లిక్ అనిపించడంతో.. బాలీవుడ్ లో ఇప్పుడు రావడమే ఏదో స్కాండల్ తో అడుగుపెట్టినట్లుంది రెజీనా పని.

ఇదే విషయంపై మాట్లాడిన రెజీనా..''దానిదేముంది.. స్టేజీ దిగగానే ''దేవుడా!!'' అనుకున్నా.. తరువాత ఇంక దానిని మర్చిపోయా..'' అంటోంది. ఆ విధంగా డ్రస్సు చేతిలో మోసపోయిన రెజీనా.. విషయాన్ని లైట్ తీస్కోండి అంటూ స్మయిలిచ్చింది.