Begin typing your search above and press return to search.

రెజీన హాట్‌ టిప్స్‌ తెలుసుకోవాలనుంటే..

By:  Tupaki Desk   |   12 April 2015 12:18 PM IST
రెజీన హాట్‌ టిప్స్‌ తెలుసుకోవాలనుంటే..
X
రెజీన కేసనాండ్ర... పరిచయమే అక్కర్లేని పేరు ఇది. నవతరం నాయికల్లో ప్రామిస్సింగ్‌ హీరోయిన్‌గా కెరీర్‌ని సాగిస్తోంది. ఎస్‌ఎంఎస్‌, రొటీన్‌ లవ్‌స్టోరి, పవర్‌, కొత్త జంట... ఇలా విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ భామ సాయిధరమ్‌తేజ్‌ సరసన 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' చిత్రంలో నటిస్తోంది. తమిళంలోనూ కొన్ని ప్రాజెక్టులకు ఓకే చెప్పింది. అయితే క్షణం తీరిక లేకున్నా ఆరోగ్యం ఎలా కాపాడుకోగలుగుతోంది? అసలే వేసవి సీజన్‌. వడగాల్పుల కాలమ్‌. ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది?

ఈ ప్రశ్నలకు సమాధానం స్వయంగా చెప్పింది అమ్మడు. అంతేకాదు ఆచరించండి నా టిప్స్‌ అంటూ కొన్నిటిని సూచించింది. వేసవిలో సాధ్యమైనంత వరకూ మేకప్‌కి దూరంగా ఉండడమే మంచిది. దానివల్ల శరీరం పొడిబారకుండా ఉంటుంది. అలాగే మంచి నీళ్లు ఎక్కువ తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా ఉండే పుచ్చకాయ తింటే మరీ మంచిది. అంతేకాదు షూటింగ్‌ అయిపోగానే వెంటనే మేకప్‌ తీసేసి ముఖాన్ని కడుక్కుని ఛర్మాన్ని కూల్‌గా ఉంచే క్రీములు రాసుకోవాలి. దానివల్ల ఫ్రెష్‌నెస్‌ ఉంటుంది.. అంటూ టిప్స్‌ చెప్పింది. మీరు కూడా ఆచరించండి మరి.