Begin typing your search above and press return to search.

ఐరెన్ లెగ్ గా మారిన మరో తార

By:  Tupaki Desk   |   9 Aug 2017 4:17 AM GMT
ఐరెన్ లెగ్ గా మారిన మరో తార
X
సౌత్ లో నటించే చాలా మంది హీరోయిన్లు మొదటి గ్లామర్ షోలంటే తెగ బయపడిపోతారు. కానీ ఆ తర్వాత నెమ్మదిగా వారు నటించిన సినిమాలు ఒక్కొక్కటిగా ప్లాప్ అవుతుంటే.. ఎలా ఆలోచిస్తారో తెలియదు గాని ఒక్కసారిగా హాట్ లుక్స్ తో కనిపించి ఫ్యాన్స్ కి షాక్ ఇస్తారు. అంతే కాకుండా కాస్త రెమ్యునరేషన్ ఎక్కువ ఆఫర్ చేసినా చీర నుంచి బీకినికి మారిన భామలు కూడా ఉన్నారు. అయితే ఒక్కోసారి ఈ తరహా గ్లామర్ షో సినిమాకి హెల్ప్ అవ్వొచ్చు కాకపోవచ్చు.. కానీ ఏమైనా తేడా వస్తే మాత్రం హీరోయిన్స్ కెరీర్ ముగిసినట్లే..

అయితే ప్రస్తుతం ఓ సౌత్ హీరయిన్ గ్లామర్ షో నే సినిమాలకు పెద్ద మైనస్ గా నిలుస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. ఆమె నార్మల్ లుక్ లో ఉన్నపుడు ఆదరించిన ప్రేక్షకులు హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయేసరికి కనీసం గుర్తించడం కూడా లేదు.. ఆమె ఎవరో కాదు రెజీనా కాసాండ్రా. ఈ అమ్మడి పరిస్థితి ఈ మధ్య ఏం బాలేదు . ఎటువంటి సినిమాలు చేసినా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.. ఇక గ్లామర్ షో ఏ మాత్రం అతిగా చూపించినా ఆ సినిమాలు డిజాస్టర్స్ అని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.. ఎందుకంటే ఆమె సందీప్ కిషన్ తో నటించిన "రారా కృష్ణయ్య" సినిమాలో హద్దులు దాటి అందాలని ఆరబోసింది. ఆమె అందాలు ఆ సినిమాకి ఏ మాత్రం హెల్ప్ కాలేదు. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో కృష్ణవంశీ తెరకెక్కించిన "నక్షత్రం" సినిమాలో కూడా స్కిన్ షో ని కాస్త ఘాటుగానే ప్రజెంట్ చేసింది.

అయితే రెజీనా ఇలా రెండు సినిమాల్లోనూ అందాలు హద్దు లేకుండా అరబోయడం ఆ సినిమాలకు కాస్త కూడా హెల్ప్ చేయలేకపోయాయి. పైగా ఐరెన్ లెగ్ అందాలు అనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి.. ప్రస్తుతం రెజీనా చేతిలో ఓ మూడు తమిళ సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం ఆ సినిమాలోతో అయినా ఈ భామ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.