Begin typing your search above and press return to search.

పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రెజీనా!

By:  Tupaki Desk   |   9 Sep 2022 8:30 AM GMT
పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రెజీనా!
X
దక్షిణ భారత చలనచిత్ర ప‌రిశ్ర‌మ‌లో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటీమణుల్లో రెజీనా కాసాండ్రా ఒక‌రు. త‌మిళ మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ.. 'శివ మనసులో శృతి'తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. 'కొత్త జంట' మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుని టాలీవుడ్ లో బిజీ బ్యూటీగా మారింది రెజీనా.

ఇక‌పోతే త్వ‌ర‌లోనే ఈ భామ 'శాకిని డాకిని' మూవీతో అల‌రించ‌బోతోంది. కొరియన్ మూవీ 'మిడ్ నైట్ రన్నర్స్' కు రీమేక్ ఇది. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సుధీర్‌ వర్మ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్‌లపై దగ్గుబాటి సురేష్ బాబు, సునీత తాటి, థామస్ కిమ్ నిర్మించారు. ఇందులో రెజీనా, నివేదా థామ‌స్ టైటిల్ పాత్ర‌ల‌ను పోషించారు.

కిడ్నాప్ డ్రామా బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ యాక్ష‌న్ కామెడీ థ్రిల్ల‌ర్ సెప్టెంబ‌ర్ 16న విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ విసృతంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ.. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న రెజీనా.. త‌న పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చింది. జీవితంలో పెళ్లి చేసుకుంటానో..లేదా.. కూడా తెలియ‌దంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

నిజానికి గ‌త కొద్ది రోజుల నుంచి రెజీనా పెళ్లిపై ఎన్నో వార్త‌లు నెట్టింట ట్రెండ్ అయ్యాయి. ఆమె సీక్రెట్ గా నిశ్చితార్థం కూడా చేసుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ, ఈ వార్త‌ల‌ను అప్పుడే రెజీనా ఖండించింది. ఇక తాజా ఇంట‌ర్వ్యూలో రెజీనా ప్రేమ‌, పెళ్లిపై స్పందిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. రెజీనా మాట్లాడుతూ.. 'నేను గ‌తంలో ఒకరిని ప్రేమించాను. కొన్ని కారణాల వల్ల మా ప్రేమ 2020లోనే ముగిసిపోయింది. దాని నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి కొంత టైమ్ ప‌ట్టింది.

ఇప్పుడు మాత్రం ఎవరిని ప్రేమించడం లేదు. సింగిల్ గానే ఉన్నాను. ప్రేమ‌, పెళ్లి వంటి విష‌యాల‌పై మాట్లాడ‌టం నాకు అస్స‌లు ఇష్టం లేదు. అస‌లు లైఫ్ లో పెళ్లి చేసుకుంటానో.. లేదో.. కూడా తెలియ‌దు. ఒక‌రిపై ఆధార‌ప‌డ‌కుండా సొంతంగా ఎలా జీవించాలో చిన్న‌త‌నం నుంచే అమ్మ నేర్పింది.

అందుకే జీవితంలో నాకు తోడు కావాలా? వ‌ద్దా? అన్న విష‌యంపై అస్స‌లు ఆలోచించ‌ను' అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి. మ‌రి రెజీనాకు పెళ్లిపై ఆస‌క్తి త‌గ్గిపోవ‌డానికి బ్రేక‌ప్ కార‌ణ‌మా..? లేక‌ మ‌రేదైనా ఉంది..? అన్న‌ది తెలియాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.