Begin typing your search above and press return to search.

చీరలోయ్ చీరలు అంటున్న రెజీనా

By:  Tupaki Desk   |   6 March 2016 4:16 AM GMT
చీరలోయ్ చీరలు అంటున్న రెజీనా
X
ఈ మధ్య ఎక్కడ కనిపించినా గ్లామర్ తో కొడుతున్న రెజీనా కసాండ్రా.. ఇప్పుడు కొత్త అవతారం ఎత్తుతోంది. ఓ స్టోర్ లో సేల్స్ గాళ్ గా మారిపోతోంది రెజీనా. ఈ హీరోయిన్ కి ఏమైంది.. చేతిలో అన్ని సినిమాలు పెట్టుకుని.. కొత్త వ్యాపారం మొదలుపెట్టిందా అనుకోవచ్చు కానీ.. ఈ అవతారం ఓ మంచి పని కోసం చేస్తోంది రెజీనా.

'రేపు నేను మాదాపూర్ లోని నీరూస్ ఎంపోరియంలో కొన్ని చీరలు అమ్మబోతున్నాను. జ్యోతి, ఆమె కుటుంబానికి సాయం చేసేందుకు వచ్చి నాకు, ఆమెకు సాయం చేయండి.' అంటూ ట్వీట్ చేసింది రెజీనా. ఇదంతా మంచు లక్ష్మి నిర్వహిస్తున్న మేముసైతం కార్యక్రమం కోసం చేయబోతున్న ఎపిసోడ్. ఈ స్టోర్ లో ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం 12.30వరకూ.. 3 గంటలపాటు రెజీనా సేల్స్ గాళ్ అయిపోతుందన్న మాట. ఇలా వచ్చిన ఫండ్స్ ను ఆయా కుటుంబాలకు సాయం చేసేందుకు ఉపయోగించడం.. మేముసైతం ప్రోగ్రాం ఉద్దేశ్యం.

మంచు వారసుడు మనోజ్ తో కలిసి రెజీనా రొమాన్స్ చేసిన మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో ఉంది. ఇలా మేముసైతంలో పాల్గొనడం ద్వారా అటు అక్క మంచు లక్ష్మికి, ఇటు తమ్ముడు మంచు మనోజ్ తో తను చేసిన మూవీ ప్రమోషన్ కి ఉపయోగపడేలా రెజీనా ప్లాన్ చేసిందన్న మాట. ఏమైనా.. ఈ భామకి ఈ మధ్య తెలివితేటలు పెరిగాయ్ కదూ.