Begin typing your search above and press return to search.

దిగ్గ‌జాల‌నే షేక్ చేస్తున్న ప్రాంతీయ ఓటీటీ..!

By:  Tupaki Desk   |   22 Jan 2021 2:30 AM GMT
దిగ్గ‌జాల‌నే షేక్ చేస్తున్న ప్రాంతీయ ఓటీటీ..!
X
నెట్‌ఫ్లిక్స్ .. అమెజాన్ ఒరిజిన‌ల్ కంటెంట్ ను ఉత్పత్తి చేయడం ద్వారా ఇండ‌స్ట్రీల్లో బిగ్ గేమ్ ప్లేయ‌ర్స్ గా వెలిగిపోతున్నాయి. OTT ప్లాట్ ఫాం ప్ర‌తి ఒక్క‌రికీ పాఠాలు నేర్పిస్తోంది. ఇక్క‌డ ప్ర‌తిదీ క‌ఠినంగా ఉంటుంద‌ని తీవ్ర‌మైన పోటీని ఎదుర్కోవాల‌ని నెమ్మ‌దిగా అంద‌రికీ అర్థ‌మ‌వుతోంది. ఇక‌పై నెట్ ఫ్లిక్స్.. అమెజాన్ సైతం కొత్త తెలుగు సినిమాల జాబితాను పెంచాల్సిన అవసరం ఉంది.

ఆ స్థాయిలో ఆ రెండు దిగ్గ‌జాల‌కు పోటీ ఇచ్చేందుకు ఆహా - తెలుగు వార్ లోకి దిగ‌డం ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆహా ఇటీవల రవితేజ సూపర్ హిట్ క్రాక్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. నాగ చైతన్య - సాయి పల్లవి నటించిన `లవ్ స్టోరీ` హక్కులను కూడా ఇది ఛేజిక్కించుకుంది. ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త సినిమాల‌ హ‌క్కుల్ని కొనేస్తూ .. ఒరిజిన‌ల్ కంటెంట్ కోసం కూడా ఆహా పోటీప‌డుతోంది.

త‌దుప‌రి అఖిల్ హీరోగా న‌టిస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` ను ప్రత్యేకంగా ఆహా వేదికపైనే బ్ర‌హ్మాండ‌మైన ప‌బ్లిసిటీతో హైప్ పెంచి ఆహాలోనే స్ట్రీమింగ్ చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ -బన్నీ వాస్ నిర్మించారు కాబ‌ట్టి తమ సొంత సినిమాని ఆహాలో రిలీజ్ చేస్తార‌న్న‌మాట‌. ఇక 2021-22 సీజ‌న్ లో రిలీజ‌య్యే ప‌లు క్రేజీ చిత్రాల్ని కొనేస్తార‌ట‌. అంటే ఆ మేర‌కు ఇత‌ర కార్పొరెట్ దిగ్గ‌జాల‌కు ఆహా సవాల్ విసురుతున్న‌ట్టేన‌ని భావిస్తున్నారు.