Begin typing your search above and press return to search.
సోనూసూద్ హెల్ప్ కావాలా రిజిస్టర్ చేసుకోండి!
By: Tupaki Desk | 3 April 2021 4:30 PM GMTఒక వ్యక్తి గుర్తింపు తెచ్చుకుంటున్నారంటే.. ఆయన పేరును వాడుకునే బ్యాచ్ కూడా మరోవైపు తయారవుతూనే ఉంటుంది. లాక్ డౌన్ వేళ బడా పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు ఎంగిలి చేతిని కూడా విదిలించే ప్రయత్నం చేయలేదు. కానీ.. సోనూసూద్ మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అన్నార్తులను ఆదుకున్నారు. ఇందుకోసం తన ఇంటిని కూడా తాకట్టు పెట్టినట్టు వార్తలు వచ్చాయి.
సోనూ సహాయం అందుకున్నవారిలో తెలుగు వాళ్లు కూడా ఉన్నారు. ఈవిధంగా దేశవ్యాప్తంగా ఎంతో మందికి అండగా నిలిచాడీ రియల్ హీరో. అయితే.. కొందరు సైబర్ మోసగాళ్లు సోనూ సూద్ పేరు వాడుకుంటూ జనాలను మోసం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఇలా చేయగా.. తాజాగా మరో వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు.
బీహార్ కు చెందిన ఆశిష్ కుమార్ అనే వ్యక్తి.. సోనూ సహాయం కావాలంటే తనను సంప్రదించండి అంటూ సోషల్ మీడియాలో ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు. దీంతో.. చాలా మంది అతనికి ఫోన్ చేసి.. తమకు సహాయం జరిగేలా చూడాలని వేడుకోవడం మొదలు పెట్టారు. అయితే.. సహాయం అందుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అందుకోసం కొంత ఫీజు చెల్లించాలని వసూళ్లు మొదలు పెట్టాడు.
ఈ విధంగా ఎంతో మంది దగ్గర వసూళ్లకు పాల్పడినట్టు తెలిసింది. ఎన్ని రోజులైనప్పటికీ.. సూనూ సూద్ నుంచి తమకు సహాయం అందకపోవడంతో అనుమానం వచ్చిన జనం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా.. నిందితుడు బిహార్ వాసిగా గుర్తించినట్టు సమాచారం.