Begin typing your search above and press return to search.
ఎన్నో సార్లు నేను రష్మికను కాదని చెప్పేశా..!
By: Tupaki Desk | 4 Jan 2023 12:30 PM GMTఛలో మరియు గీతా గోవిందం సినిమాలతో టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా మారిన రష్మిక మందన్నా పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెల్సిందే. ఆ సినిమా సీక్వెల్ కు రష్మిక మందన్నా రెడీ అవుతున్న విషయం తెల్సిందే. ఇక ఈ అమ్మడు వారసుడు సినిమా తో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
వారసుడు సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాలను తక్కువ చేసినట్లుగా ఈమె మాట్లాడింది అంటూ కొందరు విమర్శించిన విషయం తెల్సిందే. ఆ విమర్శలకు సమాధానం అన్నట్లుగా తనకు సౌత్ ఇండియాపై ఉన్న అభిమానం ను రష్మిక మందన్నా చాటుకునే ప్రయత్నం చేస్తోంది.
నాది సొంత రాష్ట్రం కర్ణాటక అయినా కూడా తమిళనాడులో కొంత కాలం ఉన్నాను. ఆ రెండు రాష్ట్రాలతో నాకు మంచి అనుబంధం ఉంది. హైదరాబాద్ లో షూటింగ్స్ కోసం ఎక్కువగా ఉండాల్సి వస్తుంది. కనుక తెలంగాణ రాష్ట్రం కూడా నాకు చాలా ప్రత్యేకమైనది. హైదరాబాద్ నాకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. హైదరాబాద్ లో నేను చాలా ఫ్రీ గా ఉండగలను.
హైదరాబాద్ లోని కాఫీ షాప్స్ కి.. సినిమా హాల్స్ మరియు మాల్స్ కు నేను రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాను. ఆ సమయంలో నేను కనీసం ముసుగు వేసుకోను. నా ఫేస్ ను ఆ సమయంలో నేను కవర్ చేసుకోను. కొన్ని సార్లు నన్ను కొందరు గుర్తించి దగ్గరకు వస్తారు.
అప్పుడు నేను రష్మిక ను కాదని చెప్తూ ఉంటాను. అలా చాలా సార్లు మీరు పొరబడుతున్నారు నేను రష్మిక మందన్నా ను కాదు అంటూ చెప్పానని సరదాగా రష్మిక పేర్కొంది.
బాలీవుడ్ లో ఇప్పుడు నాకు మంచి గుర్తింపు ఉంది. చాలా మంది అక్కడ నన్ను గుర్తిస్తున్నారు. కరోనా ముందు వరకు నాకు పెద్దగా అక్కడ గుర్తింపు లేదు. కానీ ఇప్పుడు అక్కడ మంచి గుర్తింపు లభించింది అంటూ రష్మిక మందన్నా చెప్పుకొచ్చింది. సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలను కూడా వరుసగా చేయాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.