Begin typing your search above and press return to search.

పర్ఫెక్ట్ గా సెట్ అయిన శృతి..

By:  Tupaki Desk   |   25 Feb 2016 7:25 AM GMT
పర్ఫెక్ట్ గా సెట్ అయిన శృతి..
X
సౌత్ తో పాటు నార్త్ లోనూ తమిళ సోయగం శృతిహాసన్ దూసుకుపోతోంది. గతేడాది వెల్ కం బ్యాక్ మూవీతో వంద కోట్ల కలెక్షన్ సాధించిన సినిమాలో హీరోయిన్ గా గుర్తింపు పొందిన శృతి.. ఇప్పుడు మరో బాలీవుడ్ మూవీలో మెరవనుంది. ప్రస్తుతం జాన్ అబ్రహాం తో జోడీ కట్టిన ఈ సుందరి.. రాకీ హ్యాండ్ సమ్ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

త్వరలో విడుదలకు రెడీ అవుతున్న రాకీ హ్యాండ్ సమ్.. షూటింగ్ ప్రారంభం నుంచే ఆసక్తిని కలుగచేసింది. ఇప్పుడీ మూవీకి సంబంధించిన ఓ ప్రోమో సాంగ్ ను యూనిట్ రిలీజ్ చేసింది. సన్నీ బావ్రా సంగీతం అందించగా.. శ్రేయా ఘోషల్ - ఇందర్ బావ్రాలు పాడిన 'రెహనుమా' సాంగ్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ పాటలో జాన్ అబ్రహాం - శృతి హాసన్ ల రొమాన్స్ హైలైట్ గా చెప్పుకోవాలి. ఒక వైపు సూపర్బ్ సాంగ్ మరోవైపు శృతి అందాలు.. ఆడియన్స్ ను కట్టిపడేస్తున్నాయి. ఇప్పటివరకూ ఈ భామ ఎన్నడూ కనిపించనంత హాట్ గా మెరిసిపోవడం విశేషం.

ముఖ్యంగా బీచ్ వేర్ లో అయితే శృతి హాసన్ అందాలను మళ్లీ మళ్లీ చూడాల్సిందే. ఇక.. ఓ బెడ్ రూమ్ ఇంటిమేట్ సీన్ ని కూడా పాటలో ప్రొజెక్ట్ చేశారు. ఇందులో కూడా.. జాన్ - శృతిల కెమిస్ట్రీ భలేగా కుదిరింది. మొత్తానికి రాకీ హ్యాండ్సమ్ తో.. శృతి హాసన్ అందాల విందు చేయడం మాత్రం ఖాయమని తేలిపోయింది.