Begin typing your search above and press return to search.
చాలా సెన్సిటివ్ నేను.. అందుకే రిజెక్ట్ అయితే తట్టుకోలేను
By: Tupaki Desk | 23 March 2021 3:30 PM GMTసినీ ప్రపంచంలో ఎంతోమంది సినీతారలు కెరీర్ ఆరంభంలో విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారిలో నేను కూడా ఉన్నాను అంటోంది హీరోయిన్ అతిథిరావు హైదరి. జీవితంలో తిరస్కరణ పొందటం అనేది వ్యక్తిగత భావాలను ఎంతో బాధిస్తుందని చెబుతోంది. 'నేను కూడా చాలా సెన్సిటివ్. ఒక నటిగా థిక్ స్కిన్ తో ఉండటం అనేది చాలా కష్టం. కానీ జీవితంలో విమర్శలు అనేవి ఒక భాగమే' అంటోంది. 'ఇతరులతో పోల్చడం, ఎల్లప్పుడూ కిందికి లాగే ప్రయత్నం చేయడం, వేలెత్తి చూపించేందుకు ట్రై చేస్తుంటారు. నేను సెన్సిటివ్. అందుకే ప్రతిదీ అనుభవం చేయగలను. నేను ఎంతగట్టిగా నవ్వుతానో.. అంతేగా బిగ్గరగా ఏడవగలను అదేం పెద్ద విషయం కాదు. కానీ సెన్సిటివ్ పరంగా నేను యాక్టర్ అయినా మనిషినే. కాబట్టి నా జీవితంలో కూడా బ్యాడ్ డేస్ వస్తుంటాయి. కానీ వాటి గురించి నేనెప్పుడూ ఆలోచించను. ఎందుకంటే నా ఆలోచన ఎల్లప్పుడూ ముందుకే ఉంటుంది" అంటూ అతిథి చెప్పుకొచ్చింది.
రీసెంట్ గా అతిథి 'ది గర్ల్ ఆన్ ది ట్రెయిన్' అనే సినిమాలో మెరిసింది. ఆమె ఇంకా మాట్లాడుతూ..'ఒక నటిగా రిజెక్షన్ అనేది చాలా పర్సనల్. ఎందుకంటే ఎదుటివారు మనల్ని రిజెక్ట్ చేశారు కాబట్టి. కానీ నువ్వెప్పుడూ నువ్వే. రిజెక్ట్ అయ్యావ్ అనేది కష్టంగా అనిపిస్తుంది. ఒక్కోసారి హార్ట్ బ్రేక్ అయినంత పని అవుతుంది' అంటోంది అమ్మడు. అలాగే.. 'నేను కూడా అదే రకం. ఎవరైతే చీకటిలో వెలుతురు కోసం ఎదురుచూస్తుంటారో వారిలా. ఎందుకంటే నాకిప్పుడు బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి. కానీ నేను బ్యాడ్ డేస్ కూడా బ్లెస్సింగ్స్ లా భావిస్తాను. ఒక వ్యక్తి నా ముందు డోర్ నుండి వెళ్లాడంటే నేను ఐదు అంశాలను పరిగణిస్తాను. కానీ అందులో ఖచ్చితంగా నాకు నచ్చని రెండు అంశాలు వారిలో ఉంటాయి. అలాగే తాను పాజిటివ్ గా ఉండటానికి గల కారణాలు కూడా బయటపెట్టింది అతిథి. నేను ఎల్లప్పుడూ ముందుకే ఆలోచన చేస్తాను. గడిచిన వాటి గురించి తల్చుకుంటూ ఉండిపోలేను. అందుకే నేను పాజిటివ్ గా ఉంటాను' అని చెప్పుకొచ్చింది అతిథి. ప్రస్తుతం అమ్మడు అజీబ్ దస్తాన్, హే సినామిక సినిమాల్లో నటిస్తోంది.