Begin typing your search above and press return to search.

`మ‌హాన‌టి`పై రేఖ మౌనం ఎందుకు?

By:  Tupaki Desk   |   18 May 2018 6:55 AM GMT
`మ‌హాన‌టి`పై రేఖ మౌనం ఎందుకు?
X
లెజెండ‌రీ హీరోయిన్ సావిత్రి బ‌యోపిక్ ‘మహానటి’ ప్రేక్ష‌కుల‌తోపాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకొని హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో తన తండ్రి పాత్రను చిత్రీకరించిన తీరు ఆవేదన కలిగిస్తోందని జెమినీ గణేశన్‌ కమార్తె కమలా సెల్వరాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఎంజీఆర్‌, శివాజీగణేశన్ లతో పాటు అగ్ర‌హీరోగా వెలుగొందిన తన తండ్రి జెమినీగణేశన్ ను అవ‌కాశాలు లేని హీరోగా చూపించార‌ని ఆమె ఆరోపించారు. త‌న త‌ల్లిపై ప్రేమ లేకుండానే ఎలా పెళ్లి చేసుకుంటార‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఈ నేప‌థ్యంలో మ‌రో కొత్త అంశం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆ సినిమాలో జెమిని గణేషన్ కు అలివేలు - సావిత్రి....ఇద్దరు భార్యలున్న‌ట్లు చూపించారు. అయితే, ఆ చిత్రంలోని ఒక సీన్ లో జెమినీ-పుష్పవల్లి-సావిత్రిల మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతుంది. జెమినీ, పుష్ప‌వ‌ల్లిల‌కు పెళ్లి కాలేద‌ని, బాలీవుడ్ ఎవ‌ర్ గ్రీన్ బ్యూటీ హీరోయిన్ రేఖా వారికి పుట్టిన బిడ్డ అని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఈ నేప‌థ్యంలో క‌మ‌లా సెల్వ‌రాజ్....త‌న తండ్రి పాత్ర గురించి ముందుకు వ‌చ్చార‌ని...కానీ, రేఖా ఇప్ప‌టివ‌ర‌కు పుష్ప‌వ‌ల్లి పాత్ర‌పై, జెమినీ పై స్పందించ‌క‌పోవ‌డం పై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

వాస్త‌వానికి జెమినీ-పుష్ప‌వ‌ల్ల ల మ‌ధ్య సంబంధం గురించి `మహానటి`లో రెండు మూడు సన్నివేశాలు ఉన్నాయట. అప్ప‌టికే చిత్రం నిడివి ఎక్కువ కావ‌డంతో వాటిని నాగ్ అశ్విన్ తొల‌గించారు. వాస్తవానికి ఈ చిత్రంలో పుష్ప‌వ‌ల్లికి జెమినీతో ఎఫైర్ ఉన్న‌ట్లు చూపించారు. అయితే, ఇప్ప‌టివ‌రకు ఆ పాత్ర‌పై రేఖ స్పందించక‌పోగా...త‌న తండ్రిని అవమానించారంటూ క‌మ‌లా సెల్వ‌రాజ్ మీడియా ముందుకు వ‌చ్చారు. `మ‌హాన‌టి`కోసం ఆతృత‌గా ఎదురుచూస్తున్నాన‌ని చెప్పిన రేఖ‌...సినిమా విడుద‌లైన త‌ర్వాత మౌనం వ‌హించ‌డం వెనుక కార‌ణాలేమిట‌నేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సాధార‌ణంగా పుష్ప‌వ‌ల్లి పాత్ర‌పై రేఖ అభ్యంత‌రాలు లేవ‌నెత్తుతార‌ని ప‌లువురు భావించారు. అయితే, మ‌రోవైపు జెమినీకి రేఖ‌కు మ‌ధ్య పెద్ద‌గా అనుబంధం లేద‌ని, ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌కు కూడా ఆమె హాజ‌రు కాలేద‌ని తెలుస్తోంది. దీంతో, తన త‌ల్లిని జెమినీ మోసం చేశార‌నే భావ‌న‌లో ఉన్న రేఖ ...ఈ చిత్రంపై పెద్ద‌గా స్పందించ‌ద‌లుచుకోలేద‌ని బాలీవుడ్ టాక్.