Begin typing your search above and press return to search.

బిగ్‌ బి తో రిలేషన్‌ పై రేఖ షాకింగ్‌ వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   30 May 2019 7:37 AM GMT
బిగ్‌ బి తో రిలేషన్‌ పై రేఖ షాకింగ్‌ వ్యాఖ్యలు
X
బాలీవుడ్‌ లో ప్రేమ కథలు.. బ్రేకప్‌ లు చాలా కామన్‌. ఇప్పటి వరకు ఎన్నో ప్రేమ కథలు బాలీవుడ్‌ స్టార్స్‌ వి చూశాం. అయితే అమితాబచ్చన్‌ మరియు రేఖల లవ్‌ అఫైర్‌ గురించి చాలా ప్రత్యేకం. వారిది మామూలు ప్రేమ కాదని బాలీవుడ్‌ వర్గాల వారు అంటూ ఉంటారు. ఎంతో ఘాడంగా ప్రేమించుకున్న వారిద్దరు.. అప్పట్లో పెళ్లి చేసుకుంటారని భావించింనా కూడా కొన్ని కారణాల వల్ల బ్రేకప్‌ అయ్యారు. జయ బచ్చన్‌ ను పెళ్లి చేసుకున్న అమితాబచ్చన్‌ పిల్లలు.. మనవడు మనవరాళ్లతో సుఖ జీవితాన్ని గడుపుతుంటే ఆయన్ను ప్రేమించిన రేఖ మాత్రం ఇంకా ఆయన్ను ఆరాధిస్తూనే ఉన్నట్లుగా తాజా ఇంటర్వ్యూలో ఆమె వ్యాఖ్యలను బట్టి అర్ధం చేసుకోవచ్చు.

తాజాగా రేఖ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... అమితాబ్‌ తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. అంతటి గొప్ప వ్యక్తిని.. స్వార్ధం లేకుండా నాలా ప్రేమించిన వ్యక్తి మరొకరు లేరు. అమితాబ్‌ పై నాకు ఉన్నది ప్రేమ కాదు అంతకు మించి. లవ్‌, అఫెక్షన్‌ అనే పదాలు మా మద్య ఉన్న బంధంకు సరిపోవు. అమితాబ్‌ ప్రస్తుతం సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. కొడుకు.. కోడలు.. కూతురు.. మనవడు మనవరాళు ఇలా పలు బంధాలతో ఆయన సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన జీవితంలో చిచ్చు పెట్టాలని నేను కోరుకోవడం లేదు.

ఎప్పుడు కూడా ఆయన సుఖంగా ఉండాలని మాత్రమే ఆశ పడ్డాను. మేమిద్దం ఇప్పటికి ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో పలకరించుకుంటాం. చాలా నార్మల్‌ గా నాకు నమస్కారం పెట్టడం నేను నమస్కారం పెట్టడం జరుగుతుంది. ఆయన నాకు ఎప్పుడు కనిపించిన ఒక చిరు నవ్వు నవ్వి విష్‌ చేయడం జరుగుతుందని రేఖ చెప్పుకొచ్చింది. ఇప్పటికి అమితాబ్‌ ను రేఖ ఆరాధిస్తుందని ఆమె మాటలతో వెళ్లడయ్యింది. ఇప్పటికి నేను ఆయనతో నటించడం జరిగితే అద్బుతంగా ప్రేక్షకులు రిసీవ్‌ చేసుకుంటారు. కాని ఇప్పుడు మళ్లీ ఆయనతో నటించి ఆయనకు దగ్గర అవ్వడం నాకు ఇష్టం లేదు. ఆయన ఎప్పుడు కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ రేఖ చెప్పడం చర్చనీయాంశం అవుతోంది.