Begin typing your search above and press return to search.
రేఖ ఆత్మకథలో ఎన్నో సంచలనాలు!
By: Tupaki Desk | 16 Sep 2016 5:53 AM GMTఅందాల నటి రేఖ... బాలీవుడ్ ని ఒక ఊపు సౌందర్య రాశి. వెండితెర మీద తిరుగులేని నటిగా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో... వ్యక్తిగత జీవితంలో కూడా అదే రేంజిలో ఎన్నో సంచలనాలున్నాయి! అప్పట్లో ఆమె పెళ్లి వ్యవహారం వివాదాస్పదం అయింది, అమితాబ్ తో ప్రేమ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇలా రకరకాల ఎఫైర్లు - రూమర్లు - చీవాట్లూ చెప్పుదెబ్బలు ఆమె వ్యక్తిగత జీవితంలో చీకటి కోణాలు! ఇన్నాళ్లూ ఈ ఘటనలేనవీ బయటకి రాలేదు. ఆమె జీవితంలోని రహస్యాలన్నింటినీ బయటపెడుతూ ఓ పుస్తకం వచ్చింది. ‘రేఖ... ద అన్ టోల్డ్ స్టోరీ’ యాసీన్ ఉస్మాన్ రాశారు. రేఖ జీవితంలోని రహస్యాలన్నీ ఈ పుస్తకం బట్టబయలు చేస్తోంది.
ఈ పుస్తకంలో ప్రముఖంగా ఆమె రహస్య వివాహాల గురించి వివరంగా చర్చించారు. అప్పట్లో వినోద్ మెహ్రా - రేఖాలు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న వెంటనే వినోద్ మెహ్రా ఇంటికి వెళ్లారు. వినోద్ తల్లి రేఖను ఇంట్లోకి రానివ్వలేదు. అంతేకాదు, రేఖతో పెద్ద ఎత్తున గొడవకు దిగింది. ఈ గొడవలో ఆమె రేఖని చెప్పుతో కూడా కొట్టిందట! అంతా చూస్తూ వినోద్ మౌనంగా ఉండిపోయాడు. ఆ తరువాత, వినోద్ తో రేఖ తెగతెంపులు చేసుకుంది. ఆ తరువాత ముఖేష్ అగర్వాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించడం అప్పట్లో సంచలనమైంది. అయితే, ఈ ప్రకటన జరిగిన కొద్దిరోజులకే ముఖేష్ ఆత్మహత్య చేసుకున్నాడు! చిత్రం ఏంటంటే, రేఖ వాడిన దుపట్టాతోనే ఉరి పెట్టుకుని అతడు మరిణించాడు. దీంతో అందరూ రేఖవైపే అనుమానంగా చూశారు. చాలామంది ఆమెనే అవమానించారట!
ఇక, అమితాబ్ బచ్చన్ తో రేఖ నడిపిన ప్రేమాయణం గురించి కూడా పుస్తకంలో కూలంకషంగా ఉంది. మొదట్లో ఈ ఇద్దరికీ పెళ్లి జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల, పరిస్థితులు అనుకూలించనందువల్ల ఈ పెళ్లి కుదరలేదు. తరువాత, జయాను అమితాబ్ పెళ్లి చేసుకున్నారు. అయితే, అమితాబ్ విషయమై జయతో చాలాసార్లు గొడవ పడింది రేఖ. చివరికి రేఖతో సినిమాలు చేసేందుకు జయ ఒప్పుకునేది కాదట. దీంతో రగిలిపోయిన రేఖ ఓ అవార్డు ఫంక్షన్ లో జయా బచ్చన్ ను అవమానిస్తూ మాట్లాడిందిట. ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.