Begin typing your search above and press return to search.

అప్పుడు రేఖ.. సంజయ్ పెళ్లి జరిగిందట?

By:  Tupaki Desk   |   6 March 2017 8:18 AM GMT
అప్పుడు రేఖ.. సంజయ్ పెళ్లి జరిగిందట?
X
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ రేఖకు సంబంధించిన సంచలన విషయం తాజాగా బయటకు వచ్చింది. ఇప్పటికే పలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆమె వ్యక్తిగత జీవితం.. తాజాగా మరోసారి చర్చకు తెర తీసింది. అప్పుడెప్పుడో జరిగి పోయిన విషయాన్ని తాజాగా ఒక పుస్తకంలో ప్రస్తావించారన్న పేరుతో ఇప్పుడు కొత్త వార్తలు పుట్టుకు వస్తున్నాయి.

రైటర్ యాసర్ ఉస్మాన్ రేఖ జీవితచరిత్ర మీద తాజాగా ‘‘రేఖ- ది అన్ టోల్డ్ స్టోరీ’ పేరిట ఒక పుస్తకాన్ రాశారు. ఇంకా బయటకు రాని ఈ పుస్తకంలో సంచలన విషయాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి షాకింగ్ నిజాల్ని ఇందులో ప్రస్తావించినట్లుగా చెబుతున్నారు. అందులో ఒకటి.. రేఖ భర్త ముఖేశ్ అగర్వాల్ మరణించిన తర్వాత కూడా రేఖ నుదిటిపై కుంకుమ పెట్టుకునేవారు.

భర్త చనిపోయిన తర్వాత అలా పెట్టుకోవటం ఉండని నేపథ్యంలో.. రేఖ ఫ్యాషన్ కోసం అలా పెట్టుకునే వారని అనుకునేవారు.కానీ.. దానికి అసలుకారణం వేరే ఉందన్న విషయాన్ని ఇప్పుడు చెబుతున్నారు. తనకన్నా ఐదేళ్లు చిన్నవాడైన సంజయ్ దత్ ను రేఖ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని.. అందుకే అలా నుదుట సింధూరం పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. 1984లో వచ్చిన జమీన్ అస్మాన్ సినిమా షూటింగ్సందర్భంగా వీరిద్దరి పెళ్లి జరిగిందని.. ఇద్దరూ కొంతకాలం ముంబయికి దూరంగా గడిపినట్లుగా ఈ పుస్తకంలో ఉన్నట్లు చెబుతున్నారు.

అయితే.. వీరి రహస్య వివాహం గురించి సంజయ్ తండ్రి సునీల్ దత్ కు తెలిసిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. కొడుకు తీసుకొచ్చి రిచాశర్మతో పెళ్లి జరిపినట్లుగా చెబుతున్నారు. అయితే.. తన పుస్తకంలో ఇలాంటి విషయాన్ని తాను చెప్పలేదని.. ఈ సమాచారం ఎలా వచ్చిందో తనకు తెలీదని పుస్తక రచయిత చెప్పటం గమనార్హం. అయితే.. ఈ పుస్తకం విడుదలయ్యాక అసలు విషయం తెలుస్తుందన్నమాటను పలువురు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/