Begin typing your search above and press return to search.
సిల్లీ గాళ్ళకు మంచి ఛాన్స్
By: Tupaki Desk | 5 Sep 2018 11:30 AM GMTఎల్లుండి చెప్పుకోదగ్గ నెంబర్ లో సినిమాలైతే విడుదలవుతున్నాయి కానీ ఏదీ స్టార్లు ఉన్నది కాకపోవడంతో భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఉన్నంతలో సిల్లీ ఫెలోస్ వైపు గాలి బాగానే మళ్లుతోంది. దీనికి కారణం లేకపోలేదు. చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ సునీల్ కలిసి నటించగా ఇంతకు ముందు సుడిగాడుతో కామెడీ జానర్ లో కూడా మెప్పించగలను అని ప్రూవ్ చేసిన భీమినేని శ్రీనివాసరావు దీనికి దర్శకుడు కావడం. ట్రైలర్ ఆకట్టుకోలేకపోయినా సరదాగా టైం పాస్ కోసం నవ్వుకునే కంటెంట్ ఉందనే అభిప్రాయం కలిగించింది. దాన్ని కనీస స్థాయిలో నిలబెట్టుకున్న చాలు ఆపై వారం శైలజారెడ్డి అల్లుడు వచ్చే దాకా వసూళ్లు రాబట్టుకోవచ్చు. రొటీన్ కామెడీతో మెప్పించడం కష్టం కానీ ఏ మాత్రం వైవిధ్యం ఉన్నా చాలు ముఖ్యంగా బిసి సెంటర్స్ లో సిల్లీ ఫెలోస్ మంచి ఆప్షన్ గా మిగిలే ఛాన్స్ ఉంది.
అయితే పోటీ మాత్రం చిన్న సినిమాల రూపంలో భారీగా ఉంది. సురేష్ బ్యానర్ ప్రత్యేకంగా ప్రమోట్ చేసి విడుదల చేస్తున్న కేరాఫ్ కంచరపాలెం గురించిన పబ్లిసిటీ పీక్స్ లో జరుగుతోంది. నగరాలతో పాటు కొన్ని మల్టీ ప్లెక్సుల్లో బాగానే ఆడే అవకాశాలు ఉన్నా బిసి సెంటర్స్ లో ఓపెనింగ్స్ మొదటి రెండు రోజులు ఆశించడం కష్టమే. ఇక ప్రేమకు రైన్ చెక్ అనే మరో సినిమా కూడా రేస్ లో ఉంది. పవన్ బెస్ట్ ఫ్రెండ్ శరత్ మరార్ తీసిన సినిమాగా తప్ప ఇంకే ప్రత్యేకమైన గుర్తింపు లేదు. పాజిటివ్ టాక్ వచ్చిందా ఓకే. ఛాన్స్ తీసుకోవచ్చు. ఇక క్రౌడ్ ఫండింగ్ లో రూపొందిన మనుది సైతం ఇదే పరిస్థితి. 3 గంటల నిడివిలో కేవలం 45 నిముషాలు మాత్రమే డైలాగ్స్ ప్రత్యేకతగా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. దీని భవితవ్యం కూడా టాక్ మీదే ఆధారపడి ఉంది. సో కాస్తో కూస్తో బలంగా కనిపిస్తోంది ప్రస్తుతానికి సిల్లీ ఫెలోస్. ఈ వారం గండాన్ని దాటుకుంటే చాలు పెట్టిన బడ్జెట్ కు వారం రోజులు సరిపోతాయి.మరీ బాగుంది అన్నా తర్వాత కూడా కొనసాగుతుంది. యుటర్న్ తో పాటు శైలజారెడ్డి అల్లుడు ప్రభావం చూపినా మరీ తీసేసే దాకా పోదు. సిల్లీ ఫెలోస్ ఈ అవకాశాన్ని ఎంతమేరకు వాడుకుంటారో చూడాలి.