Begin typing your search above and press return to search.
'ఆచార్య' విడుదల తేదీ ప్రకటన ఎప్పుడంటే..?
By: Tupaki Desk | 13 Aug 2021 8:48 AM GMTమెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలతో పోటీగా వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పటికే 'ఆచార్య' చిత్రాన్ని చివరి దశకు తీసుకొచ్చిన చిరు.. మరో మూడు ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టారు. మోహన్ రాజా దర్శకత్వంలో 'లూసిఫర్' రీమేక్ ను ఈరోజు సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఇదే క్రమంలో మెహర్ రమేష్ తో 'వేదాళమ్' మరియు బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారు చిరంజీవి. అయితే సమ్మర్ నుంచి వాయిదా పడిన ''ఆచార్య'' విడుదల తేదీపై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు.
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి - రామ్ చరణ్ హీరోలుగా 'ఆచార్య' మూవీ తెరకెక్కుతోంది. ధర్మస్థలి బ్యాక్ డ్రాప్ లో సందేశాత్మక అంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రెండు పాటలు మినహా టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. అయితే పెద్ద సినిమాలన్నీ ఇప్పటికే మంచి రిలీజ్ డేట్స్ ని బ్లాక్ చేసుకోవడంతో.. చిరంజీవి 152వ చిత్రాన్ని ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారనేది ఆసక్తికరంగా మారింది.
నిజానికి మే 23న 'ఆచార్య' చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో పోస్ట్ పోన్ చేశారు. అయితే ఇప్పుడు అక్టోబర్ నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అక్టోబర్ 13న 'ఆర్ ఆర్ ఆర్' చిత్రం వస్తుంది కాబట్టి.. నెలాఖరున 'ఆచార్య' ను తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ అప్పుడు కుదరకపోతే సంక్రాంతికి కాస్త ముందు, జనవరి 7న విడుదల చేసే సాధ్యాసాధ్యాలపై చిత్ర నిర్మాతలు ఆలోచిస్తున్నారట. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న రిలీజ్ డేట్ పై స్పష్టత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
కాగా, మెగాస్టార్ - మెగాపవర్ స్టార్ ఫస్ట్ టైమ్ కలిసి నటిస్తున్న 'ఆచార్య' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే కనిపించనుంది. సోనూసూద్ - జిషు షేన్ గుప్తా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.