Begin typing your search above and press return to search.
మణిరత్నం సినిమాకు ఆ భారం తప్పలేదు
By: Tupaki Desk | 11 April 2015 1:30 AM GMTవిలన్, కడలి సినిమాలు అట్టర్ ఫ్లాపవడంతో మణిరత్నం పనైపోయిందన్న వార్తలు వినిపించాయి. దీంతో మళ్లీ తన బలాన్ని నమ్ముకుని సఖి స్టయిల్లో 'ఓకే కణ్మణి' లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ తీశాడు మణి. ఈ సినిమాతో మణి మళ్లీ ఫామ్‌లోకి వచ్చేస్తాడని ఆశిస్తున్నారు అభిమానులు. ఈ నెల 17న విడుదల ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. ఐతే తమిళ వెర్షన్‌కు సంబంధించి మణి టీమ్‌కు పెద్ద ఇబ్బందే ఎదురైంది.
ఈ సినిమాకు తమిళ సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఐతే 'యు' సర్టిఫికెటే ఇవ్వాలంటూ కేంద్ర సెన్సార్ బోర్డుకు దరఖాస్తు చేశారు. రివైజ్డ్ కమిటీ సినిమా చూసి యు/ఎ సర్టిఫికెట్‌నే ఖరారు చేసింది. అయినా యు/ఎ సర్టిఫికెట్ వస్తే ఏంటి సమస్య అంటారా? ఇక్కడే ఉంది మతలబు. తమిళనాట తమిళంలో టైటిల్స్ పెడితే పన్ను మినహాయింపు ఉంటుందన్న సంగతి తెలిసిందే.
అందుకే ముందు ఓకే కణ్మణి అనే టైటిల్ పెట్టిన మణిరత్నం.. ఆ తర్వాత దాన్ని 'ఓ కాదల్ కణ్మణి'గా మార్చాడు. ఐతే ఈ మధ్య తమిళనాడు ప్రభుత్వం ఈ పన్ను మినహాయింపు విషయంలో కొత్త రూల్ తెచ్చింది. సినిమాకు తమిళ టైటిల్ పెట్టడంతో పాటు సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ వస్తేనే పన్ను మినహాయింపు వర్తిస్తుందని ఆదేశాలు జారీ చేసింది. దీంతో తమిళ సినిమాలకు క్లీన్ యు సర్టిఫికెట్ తెచ్చుకోవడం సవాలుగా మారింది. మణి సినిమా సహజీవనానికి సంబంధించింది కావడం.. కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉండటంతో క్లీన్ యు రాలేదు. దీంతో పన్ను భారం తప్పట్లేదు.