Begin typing your search above and press return to search.
'ఆది పురుష' రిలీజ్ మారిందా..ఇదిగో ప్రొడ్యూసర్స్ క్లారిటీ!
By: Tupaki Desk | 25 Oct 2022 11:30 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తొలి మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్'. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మూవీ కోసం యావత్ ఇండియా మొత్తం అసక్తిగా ఎదురుచూస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో ఏక కాంలో రూపొందిన ఈ మూవీని తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. కృతిసనన్ సీతగా, ప్రభాస్ రాముడిగా నటించారు. టి. సిరీస్ బ్యానర్ పై 3డీ, ఐమాక్స్ ఫార్మాట్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ డేట్ ని కొన్ని నెలల క్రితమే 2022 జనవరి 12న రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ మారిందంటూ వార్తలు పుట్టుకొస్తున్నాయి. వచ్చే సంక్రాంతికి సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య', నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' చిత్రాలు పోటీకి దిగుతున్నట్టుగా దీపావళి రోజున ప్రకటించేశాయి. వీరితో పాటు యంగ్ హీరో అఖిల్ కూడా 'ఏజెంట్' మూవీతో సంక్రాంతి బరిలో దిగుతున్నట్టుగా ప్రకటించి ట్విస్ట్ ఇచ్చాడు.
ఈ సినిమా రాక ఖరారు కావడంతో ఆది పురుష్' రిలీజ్ ని మేకర్స్ వాయిదా వేశారంటూ ప్రచారం మొదలైంది. అయితే తాజాగా ఈ ప్రచారంపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి బరిలో ఎంత మంది పోటీకి దిగినా 'ఆది పురుష్' వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ముందు ప్రకటించినట్టుగానే జనవరి 12న ఈ మూవీని విడుదల చేయాలనే నిర్ణయానికి కట్టుబడి వున్నామన్నారు. దీంతో సంక్రాంతి బరిలో దిగుతున్నట్టుగా ప్రకటించిన చిరు 'వాల్తేరు వీరయ్య, బాలయ్య వీర సింహారెడ్ది, అఖిల్ 'ఏజెంట్' ల పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.
'రాధేశ్యామ్' వంటి భారీ ఫ్లాప్ తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా 'ఆదిపురుష్' అంతే కాకుండా ప్రభాస్ నటించిన తొలి మైథలాజికల్ మూవీ. అంతే కాకుండా యావత్ దేశం మొత్తం సెంటిమెంట్ గా భావించే రామాయణం నేపథ్యంలో రూపొదిన సినిమా కావడంతో అందరి దృష్టి ఈ మూవీపైనే ప్రదానంగా వుంటుంది. బరిలో ఎన్ని సినిమాలున్న ప్రేక్షకుల ఫస్ట్ ప్రియారిటీ 'ఆదిపురుష్'పైనే వుంటుంది.
ఈ నేపథ్యంలో మిగతా సినిమాల రిలీజ్ ల విషయంలో వెనక్కి తగ్గుతారా? లేక 'ఆది పురుష్'తో పోటీపడేందుకే మొగ్గుచూపుతారా అన్నది వేచి చూడాల్సిందే. ఈ మూవీలో రాముడిగా ప్రభాస్, సీతగా క్రితి సనన్ నటిస్తుండగా లక్ష్మణుడిగా సన్నీసింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, హను మాన్ గా దేవ్ దత్త నాగే నటిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.