Begin typing your search above and press return to search.
రిలీజ్ ముందు దర్బార్ కి కోర్టు షాక్
By: Tupaki Desk | 7 Jan 2020 2:09 PM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ -నయనతార జంటగా నటించిన తాజా చిత్రం దర్బార్. మురుగదాస్ దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాని జనవరి 9న రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే సరిగ్గా రిలీజ్ ముంగిట చిత్రబృందానికి ఊహించని షాక్ తగిలింది. దర్బార్ మలేషియా రిలీజ్ కి బ్రేక్ వేస్తూ తాజాగా హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఇంతలోనే అసలేమైంది? అన్నది పరిశీలిస్తే.. 2.0 కి సంబంధించిన పాత బకాయిల్ని చెల్లించకుండానే మలేషియాలో దర్బార్ రిలీజ్ చేయడం కుదరదని తాజాగా మద్రాసు హైకోర్టు తీర్పు వెలువరించింది.
తలైవా నటించిన గత చిత్రం 2.0 మలేషియాలో అత్యంత భారీగా రిలీజైంది. అయితే అక్కడ రిలీజ్ చేసిన సంస్థకు లైకా వాళ్లు దాదాపు 23 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉండగా ఆ మొత్తాన్నిక్లియర్ చేయకపోవడమే ఇప్పుడు దర్బార్ కి చిక్కులు తెచ్చి పెడుతోంది. పాత బకాయి చెల్లించకపోవడం వల్లనే మలేషియన్ కంపెనీ దర్బార్ రిలీజ్ ని ఆపేందుకు స్టే విధించాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దానిని విచారించిన కోర్టు తక్షణం మలేషియా రిలీజ్ ని నిలిపివేసింది. 4.90 కోట్లు డిపాజిట్ చేశాకే రిలీజ్ కి అనుమతి ఉంటుందని కోర్టు తీర్పును వెలువరించింది. ఆ డిపాజిట్ క్లియర్ చేసి లైకా సంస్థ రిలీజ్ చేయాల్సి ఉంటుంది.