Begin typing your search above and press return to search.

కొత్త సినిమాల ఓటీటీ డేట్లు వచ్చేశాయి

By:  Tupaki Desk   |   23 Aug 2021 9:30 AM GMT
కొత్త సినిమాల ఓటీటీ డేట్లు వచ్చేశాయి
X
సెకండ్‌ వేవ్‌ తర్వాత విడుదల అయిన సినిమాల్లో కొన్నింటికి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. కాని వసూళ్ల విషయంలో కొన్ని సినిమాలకు నిరాశ తప్పలేదు. గత నెల చివర్లో విడుదల అయిన సత్యదేవ్‌ సినిమా తిమ్మరుసుకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కరోనా భయంతో జనాలు థియేటర్లకు రాకపోవడంతో వసూళ్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. సినిమా విడుదల అయ్యి మరీ ఎక్కువ రోజులు కాకుండానే ఓటీటీ రిలీజ్ కు సిద్దం అయ్యారు. ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్ వారు ఈ సినిమాను స్ట్రీమింగ్ రైట్స్ హక్కులు కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. తాజాగా స్ట్రీమింగ్‌ డేట్‌ ను అధికారికంగా ప్రకటించారు. నెట్ ఫ్లిక్స్ లో ఈనెల 28న స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా అధికారిక తేదీని ప్రకటించారు.

తిమ్మరుసు సినిమాను థియేటర్లలో విడుదల చేసిన సమయంలోనే వచ్చిన టాక్ నేపథ్యంలో ఓటీటీ లో ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈనెల 28 అంటూ ప్రకటన వచ్చేసింది. తిమ్మరుసు తర్వాత వచ్చిన సినిమాల్లో కిరణ్‌ నటించిన ఎస్‌ ఆర్‌ కళ్యాణ మండపం సినిమా అన్ని వర్గాల వారిని ఆకర్షించింది. సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. సెకండ్‌ వేవ్ తర్వాత మొదటి కమర్షియల్‌ హిట్ అంటూ ఎస్ ఆర్‌ కళ్యాణ మండపం సినిమాకు రెస్పాన్స్ దక్కింది. అందుకే ఎస్‌ ఆర్‌ కళ్యాణ మండపం ఓటీటీ స్ట్రీమింగ్ కోసం కూడా చాలా మంది వెయిట్‌ చేశారు. వారం క్రితం ఆహా వారు ఎస్ ఆర్‌ కళ్యాణ మండపం స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

ఎస్ ఆర్‌ కళ్యాణ మండపం సినిమా స్ట్రీమింగ్‌ తేదీని ఆహా అధికారికంగా ప్రకటించింది. తిమ్మరుసు సినిమా స్ట్రీమింగ్ అవ్వబోతున్న రోజునే ఆహా వారు కూడా తమ ఎస్‌ ఆర్‌ కళ్యాణ మండపం సినిమా స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. ఈనెల 28న కళ్యాణ మండపంను మీ ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఆహా ప్రకటించింది. తిమ్మరుసు కంటే కళ్యాణ మండపం కొత్త సినిమా.. మొన్న మొన్నటి వరకు టీవీల్లో ప్రోమోస్‌ తో సోషల్‌ మీడియాలో ప్రమోషన్స్ తో అదరగొట్టారు. అలా ఎస్ ఆర్‌ కళ్యాణ మండపం సినిమా గురించి జనాల్లో చర్చ ఎక్కువ జరుగుతుంది. ఈ రెండు సినిమాలు కూడా స్ట్రీమింగ్‌ కు రెడీ గా ఉన్నాయి.

ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా ఓటీటీ ద్వారా మరి కొన్ని కొత్త సినిమాలు కూడా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ వారం ఓటీటీ ఆడియన్స్ కు ఫుల్‌ ఎంటర్‌ టైన్ మెంట్‌ ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఎస్‌ ఆర్‌ కళ్యాణ మండపం సినిమాతో పాటు తిమ్మరుసు సినిమా స్ట్రీమింగ్ కూడా ప్రేక్షకులు ఎంజాయ్‌ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. థియేటర్ల వద్ద ఉన్న పరిస్థితులు ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. జనాలు కరోనా భయంతో థియేటర్లకు రావడానికి వెనుకాడుతున్నారు. కనుక ఓటీటీ లో విడుదల అయిన రెండు మూడు వారాల్లోనే స్ట్రీమింగ్ కు సినినిమాలు సిద్దం అవుతున్నాయి.

ఇది మంచి పరిణామమే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలు థియేటర్ లో చూడాలనుకున్న వారు వెంటనే థియేటర్‌ కు వెళ్తారు.. పర్వాలేదు రెండు మూడు వారాలు ఆగి ఓటీటీలో చూద్దాం అనుకునే వారు స్ట్రీమింగ్‌ తేదీ కోసం వెయిట్‌ చేస్తున్నారు. రాబోయే మరి కొన్ని నెలల వరకు థియేటర్లలో సినిమా విడుదల అయిన వెంటనే ఓటీటీ రిలీజ్ లు ఉండే అవకాశం ఉంది. అన్ని సినిమాలు కాకున్నా కొన్ని సినిమాలు అయినా రెండు మూడు వారాల గ్యాప్‌ లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్దం అవుతాయని విశ్లేషకులు అభప్రాయం వ్యక్తం చేస్తున్నారు.