Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ కొట్టుకు చావాలని ఈ నిర్ణయం తీసుకున్నారా?

By:  Tupaki Desk   |   5 Jan 2023 6:39 AM GMT
ఫ్యాన్స్ కొట్టుకు చావాలని ఈ నిర్ణయం తీసుకున్నారా?
X
ఉత్తర భారతంతో పోల్చితే సౌత్‌ స్టార్ హీరోలకు అభిమానులు విపరీతంగా ఉంటారు. కొందరు అభిమానులు మరీ రాక్షసంగా కూడా అప్పుడప్పుడు ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకరిని చూసి మరొకరు అన్నట్లుగా తమిళ స్టార్‌ హీరోల అభిమానులు ఈ మధ్య కాలంలో ఆన్ లైన్‌ లో మరియు ఆఫ్‌ లైన్ లో కూడా రెచ్చి పోతున్నారు. ఆ హీరో అభిమానులు.. ఈ హీరో అభిమానులు అని కాకుండా అందరూ కూడా ఒకే తరహాలో ఉన్నారు.

తమిళనాట ఉన్న ఫ్యాన్‌ వారు చాలదు అన్నట్లుగా ఇప్పుడు ఇద్దరు స్టార్‌ హీరోల యొక్క సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. కావాలని చివరి నిమిషంలో రెండు సినిమాలను ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదంగా మారింది.

జనవరి 11న వారిసు మరియు తునివు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి అంటూ అధికారికంగా డేట్‌ కన్ఫర్మ్‌ అయ్యింది. రెండు సినిమాలకు కనీసం ఒక్కటి లేదా రెండు రోజుల గ్యాప్‌ ఉన్నా కూడా ఆన్ లైన్ వార్‌ ఏమో కానీ ఆఫ్‌ లైన్ వార్‌.. థియేటర్ల వద్ద గొడవలు ఉండవు. కానీ ఇప్పుడు రెండు సినిమాలు ఒక్కరోజే అవ్వడంతో ఏం జరుగుతుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ రెండు సినిమాలు ఒకే మల్టీ ప్లెక్స్ లేదా థియేటర్ లో ఉంటే అప్పుడు ఇరు వర్గాల అభిమానులను కంట్రోల్‌ చేయడం కష్టం అవుతుందేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు సినిమాలు ఆడుతున్న థియేటర్ల వద్ద పదుల సంఖ్యలో పోలీసులు లేకుంటే మాత్రం థియేటర్లు బద్దలు అవ్వడం ఖాయం అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

అజిత్ మరియు విజయ్ ల యొక్క అభిమానులు గతంలో ఫిజికల్ గా కూడా ఎన్నో చోట్ల గొడవలకు దిగి రచ్చ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు తునివు మరియు వారిసు సినిమాలు ఒకే రోజున విడుదల చేయడం అంటే అది ఫ్యాన్స్ ను కొట్టుకు చావండి అంటూ చోద్యం చూడటమే అవుతుందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జనవరి 11న తమిళనాడులోని థియేటర్ల వద్ద ముఖ్యంగా చెన్నైలోని థియేటర్ల వద్ద ఏం జరగబోతుందో అంటూ అంతా ఆసక్తిగా మరియు ఆందోళనతో ఎదురు చూస్తూ ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.