Begin typing your search above and press return to search.
కంగనాకు అంబానీ రూ.200 కోట్లు!?
By: Tupaki Desk | 11 Sep 2020 1:00 PM GMTబాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు మహారాష్ట్ర ప్రభుత్వంకు మద్య వైరం నడుస్తోంది. ఈ వైరంతో అధికారం చేతిలో ఉండటంతో కంగనా ఆఫీస్ ను కూల్చి వేసేందుకు సిద్దం అయ్యింది. శివసేన పార్టీ నాయకులు మరియు ప్రభుత్వ వర్గాల వారు కంగనాపై కక్ష కట్టి ఆమె ఆఫీస్ ను సగానికి పైగా నేల మట్టం చేశారనే విషయం జాతీయ మీడియాలో కథనాలుగా వస్తున్న విషయం తెల్సిందే. కంగనా ఆఫీస్ విషయంలో బాలీవుడ్ వర్గాల వారు కూడా కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె ఎంతో కష్టపడి స్టార్ డం దక్కించుకుని తన సంపదతో దాన్ని నిర్మించుకుంది. కాని మీరు దాన్ని ఎలా కూల్చి వేస్తారంటూ శివసేన ప్రభుత్వంను కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఈ సమయంలో కంగనా వైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కూడా నిలిచారంటూ వార్తలు వస్తున్నాయి. కొన్ని వెబ్ మీడియాల్లో కంగనా కొత్త ఆఫీస్ నిర్మాణం కోసం అంబానీలు ఏకంగా 200 కోట్ల రూపాయలను ఆర్థిక సాయంగా చేయబోతున్నట్లగా ఆ కథనాల్లో ఉంది. కంగనాకు రిలయన్స్ వారు మద్దతుగా నిలవడంతో పాటు అంత భారీ మొత్తం ఇవ్వనున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన అధికారులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇప్పటి వరకు కంగనా స్టూడియోకు సాయం చేయబోతున్నట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు నూటికి నూరు శాతం అబద్దం. అసలు అలాంటి ప్రతిపాధన ఏమీ లేదని ఒక అధికారి పేర్కొన్నాడు. కంగనా విషయంలో ఇప్పటి వరకు అంబానీ ఫ్యామిలీ మౌనం పాటించింది తప్ప ఆమెకు మద్దతుగా నిలవడం లేదంటే ఆమెకు వ్యతిరేకంగా పని చేయడం చేయలేదు. కనుక ఆమెకు ఆఫీస్ బిల్డింగ్ కు డబ్బులు ఇచ్చే విషయం నిజం కాదని బాలీవుడ్ వర్గాలు కూడా అంటున్నాయి.