Begin typing your search above and press return to search.

మహేష్ మూవీకి రిలయన్స్ భారీ ఆఫర్

By:  Tupaki Desk   |   14 July 2016 10:10 AM IST
మహేష్ మూవీకి రిలయన్స్ భారీ ఆఫర్
X
సూపర్ స్టార్ మహేష్ బాబు-మురుగదాస్ ల కాంబినేషన్ లో రూపొందనున్న మూవీకి ఈ నెల 29న షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఇంకా షూటింగ్ కూడా మొదలుకాకముందే ఈ చిత్రానికి భారీ ఆఫర్ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అది కూడా హోల్ అండ్ సోల్ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

మహేష్ మూవీకి 100 కోట్ల బడ్జెట్ కేటాయించిన విషయం తెలిసిందే. రెండు భాషల్లో చిత్రాన్ని నిర్మించడం ద్వారా ఈ బడ్జెట్ ను ఈజీగా రికవర్ చేయచ్చన్నది మురుగ ఆలోచన. అయితే.. ఈ సినిమాకి రిలయన్స్ ఎంటర్టెయిన్మెంట్స్ నుంచి 150 కోట్ల రూపాయలకు ఆఫర్ వచ్చిందని అంటున్నారు. తెలుగు తమిళ్ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ కోసమే ఈ మొత్తం అంటున్నా.. శాటిలైట్ సహా మిగిలిన రైట్స్ కూడా కలుపుకునే ఇంత మొత్తం ఆఫర్ చేసి ఉంటారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మహేష్ తో పాటు నిర్మాతలు ఈ విషయంపై తీవ్రంగా చర్చలు జరిపేస్తున్నారు.

గతంలో యూటీవీ కూడా మహేష్ తో ఇలాంటి డీల్స్ కి ప్రయత్నించింది కానీ.. ఆఖరి నిమిషంలో డ్రాప్ అయిపోయింది. ఈరోస్ సంస్థ మాత్రమే మహేష్ మూవీలను కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు రిలయన్స్ కూడా మహేష్ సినిమాపై కన్నేసింది. ఈ సినిమాకి ఇంత క్రేజ్ రావడానికి మురుగదాస్ డైరెక్షన్ కాకుండా మరో ప్రధాన కారణం ఉంది. అదే మహేష్ డ్యుయల్ రోల్ చేయడం. గతంలో నాని మూవీలో ఓ నిమిషం పాటు ఇలాంటి సీన్ ని ఫ్యాన్స్ ఎంజాయ్. ఫుల్ ప్లెడ్జెడ్ గా హీరోగా మహేష్ ద్విపాత్రాభినయం చేయడం ఈ సినిమాతోనే.