Begin typing your search above and press return to search.

టైగర్ పైనే రిలయన్స్ నమ్మకం

By:  Tupaki Desk   |   23 Dec 2015 5:30 PM GMT
టైగర్ పైనే రిలయన్స్ నమ్మకం
X
నాన్నకు ప్రేమతో రిలీజ్ డేట్ ఎప్పుడు ? నందమూరి ఫ్యాన్స్ కి ఇప్పుడీ ప్రశ్న పెద్ద పజిల్ అయిపోయింది. జనవరి 13న పక్కా అనే యూనిట్ అంటున్నా.. బోలెడన్ని అనుమానాలు వెంటాడుతున్నాయి. ఈ మధ్య వాళ్లెవరో 'హ్యాకర్స్' అంట.. వాళ్లు కూడా రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్ పెంచేశారు.

ఇప్పటికీ నాన్నకు ప్రేమతో చిత్రంపై బోలెడంత గందరగోళం ఉంది. బాబాయ్ బాలయ్య డిక్టేటర్ ఒకవైపు, దేవిశ్రీ ప్రసాద్ చేయాల్సిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, రీ రికార్డింగ్ లను సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి మరోవైపు, ఇంకా కంప్లీట్ కాని షూటింగ్ ఇంకో వైపు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఇన్నింటి మధ్య జనవరి 8కల్లా ఫస్ట్ కాపీ అందిస్తానని డీఎస్పీ చెప్పాడన్నది ఒక్కటే పాజిటివ్ న్యూస్. వీటిల్లో ఏది మిస్ అయినా రిలీజ్ డేట్ జనవరి 13ని అందుకోవడం చాలా కష్టమయిపోతుంది. అయితే తారక్ మాత్రం ఈ డేట్ కి ఖచ్చితంగా వస్తాడని నిర్మాణంలో భాగం అయిన రిలయన్స్ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. ఈ కంపెనీ నుంచి వస్తున్నామని కానీ, వాయిదా అని కానీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం చాలామందే ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. సంక్రాంతిని గనుక ఎన్టీఆర్ మిస్ చేసుకుంటే.. ఆ స్లాట్ లో వచ్చి పండుగ చేసేసుకోవడానికి చాలానే మూవీస్ రెడీగా ఉన్నాయి.

ఇప్పటికైతే ఆడియో ఫంక్షన్ డేట్ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ.. ఈ నెల 27న నిర్వహించబోతున్నారని ఓ గట్టి టాక్ అయితే నడుస్తోంది. మరి ఆ డేట్ కి ఇంకా 4 రోజులే ఉండడంతో.. కనీసం ఆ ఫంక్షన్ లో అయినా రిలీజ్ గురించి హీరో ఎన్టీఆర్ అయినా, లేకపోతే నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ అయినా క్లారిటీ ఇవ్వచ్చన్నది ఓ అంచనా. ఎవరో ఒకరు తొందరగా ఆ డేట్ ఏదో అఫీషియల్ గా అనౌన్స్ చేయండి బాబూ... ఫ్యాన్స్ బీభత్సమయిన వెయిటింగ్ ఇక్కడ.