Begin typing your search above and press return to search.
అన్నీ రెడీ అందుకే ఈ స్పీడు !
By: Tupaki Desk | 27 Feb 2020 7:15 AM GMTప్రస్తుతం తెలుగులో కొన్ని రీమేక్ సినిమాలు జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటూ రిలీజ్ కి రెడీ అయిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ నుండి రామ్ వరకూ టాలీవుడ్ లో ఓ అరడజను రీమేక్స్ సెట్స్ పై ఉన్నాయి. వాటిలో వెంకటేష్ నారప్ప కూడా ఉంది. అయితే ఈ రీమేక్స్ విషయంలో మేకర్స్ ఫాలో అవుతుంది ఒకే ఫార్ములా. కాపీ పేస్ట్ అవును పెద్దగా మార్పులు చేయకుండా ఉన్న కథనే తీసిన సన్నివేశాలతో మళ్ళీ మన ప్రేక్షకులకు నచ్చేలా తీస్తున్నారంతే.
పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ చేయడానికి అదే మెయిన్ రీజన్. రెడీ గా ఉన్న కథ , టైం తీసుకోకుండా ఉన్నది ఉన్నట్టు తీసే డైరెక్టర్ ఇలా అన్నీ సెట్ అయినందుకే ఈ రీమేక్ ను ఒప్పుకున్నాడు. ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉన్నందుకే కేవలం కొన్ని డేట్స్ మాత్రమే ఇచ్చాడు. ఇప్పటికే సగంపైన షూటింగ్ అయిపొయింది. మార్చ్ కళ్ళా సినిమా టోటల్ షూట్ పూర్తవుతుంది. మే లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక వెంకటేష్ నారప్ప కయితే మేకర్స్ ఏ మాత్రం రిస్క్ చేయకుండా కథ , సన్నివేశాలతో పాటు లోకేషన్స్ ను కూడా వాడేసుకుంటున్నారు. అసురన్ ఎక్కడ షూట్ చేసారో నారప్ప యూనిట్ కూడా అక్కడికే వెళ్ళింది. అనంతపురం షెడ్యుల్ ఒక్కటే ఇక్కడ జరిగింది. మిగతా షూట్ అంత తమిళ్ నాడులోనే. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయిందని తెలుస్తుంది. మరో రెండు మూడు వరాల షూట్ తో టోటల్ షూట్ కి ప్యాకప్ చెప్పే ఆలోచనలో ఉన్నారు. ఉన్నది ఉన్నట్టు తీయడం వళ్ళే సినిమా ఇంత త్వరగా పూర్తయిందని ఇన్సైడ్ టాక్.
ఇక రామ్ కూడా ఒరిజినల్ ఫార్మేట్ తోనే రెడ్ సినిమాను చేస్తున్నాడు. అందుకే షూటింగ్ జెట్ స్పీడ్ లో పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కి రెండు నెలలు తీసుకొని ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇక నితిన్ కూడా అంధాదున్ రీమేక్ విషయంలో ఇదే ఫాలో అవ్వబోతున్నాడు. ఇప్పటికే మేర్లపాక తెలుగు వర్షన్ స్క్రిప్ట్ రెడీ చేసేసాడు. నితిన్ పెళ్లవ్వగానే సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. డిసెంబర్ లో రిలీజ్ ఉంటుంది.