Begin typing your search above and press return to search.

90 శాతం రీమేక్‌ లు ఫ్లాపులే

By:  Tupaki Desk   |   19 Dec 2015 11:30 AM GMT
90 శాతం రీమేక్‌ లు ఫ్లాపులే
X
సినిమా అనేది కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డుల‌తో కూడుకున్న‌ది. అందుకే ఎవ‌రూ రిస్కు చేయ‌లేరిక్క‌డ‌. నేరుగా మ‌న‌వాళ్లు రాసుకున్న క‌థ‌ల్ని సినిమాలుగా తీయాల‌న్నా నిర్మాత‌లు సందేహించే స‌న్నివేశం ఉందిప్పుడు. దానికంటే ఆల్రెడీ హిట్ట‌యిన పొరుగు సినిమాని తెలుగు లో రీమేక్ చేయ‌డం కొంత సేఫ్ అన్న ఆలోచ‌న‌లో ఉన్నారు. మ‌న నేటివిటీకి త‌గ్గ‌ట్టు మ‌లుచుకుని ఆ చిత్రాన్ని రీమేక్ చేసేందుకే నిర్మాత‌లు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆల్రెడీ హిట్ట‌యిన సినిమాలు అన్న ధైర్యంతో కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు వెద‌జ‌ల్లేందుకు రెడీ అవుతున్నారు. అందుకే పొరుగు భాష‌ల్లో ఆడిన సినిమాల‌న్నీ మ‌న భాష‌లోనూ రీమేక‌వుతున్నాయి. అయితే ఇలా వ‌చ్చిన వాటిలో ప్ర‌తిదీ స‌క్సెస్ కొడుతుందా? అంటే క‌ష్టం అని ప్రూవైంది. ఓమారు టాలీవుడ్‌ లో పొరుగు సినిమాల రీమేక్‌ ల‌పై శోధిస్తే..

చంద్ర‌ముఖి త‌మిళ్ నుంచి తెలుగులోకి వ‌చ్చి విజ‌యం సాధించింది. ఇది రీమేక్ కాదు కానీ ద్విభాషా చిత్రంగా వ‌చ్చింది. గ‌త ఏడాది వెంకీ హీరోగా దృశ్యం రీమేక్ సినిమాగా తెర‌కెక్కి తెలుగులో బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. ఈ ఏడాది అదే బాట‌లో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. వాటిలో కొన్నిటికి తెలుగు జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఈ ఏడాది రీమేక్‌ ల డీటెయిల్స్ ప‌రిశీలిస్తే.. వెంక‌టేష్ - ప‌వ‌న్‌ క‌ల్యాణ్ ప్రధాన పాత్ర‌ల్లో గోపాల గోపాల తెర‌కెక్కి ఘ‌న‌విజ‌యం సాధించింది. బాలీవుడ్‌ లో హిట్ట‌యిన‌ ఓ మైగాడ్ చిత్రానికి రీమేక్ ఇది. అలాగే త‌మిళంలో హిట్ట‌యిన సూదుక‌వ్వం చిత్రాన్ని గ‌డ్డం గ్యాంగ్ పేరుతో రీమేక్ చేశారు. అయితే ఒరిజిన‌ల్‌లో ఫీల్‌ ని ఎత్తేయ‌డంతో తెలుగు రీమేక్ అట్ట‌ర్‌ ఫ్లాపైంది. ఇక క‌న్న‌డ‌లో విజ‌యం సాధించిన టైమ్ పాస్ చిత్రాన్ని పూరి జ‌గన్నాథ్ త‌న‌యుడు ఆకాశ్ హీరోగా ఆంధ్రా పోరి టైటిల్‌ తో రీమేక్ చేశారు. సినిమా ఫ‌లితం రివ‌ర్సు లో పంచ్ ఇచ్చింది. ఫ్లాప్ అన్న బ్యాడ్ నేమ్‌ తెచ్చుకుంది.

అలాగే క‌న్న‌డ సినిమా ఛార్మినార్‌ ని ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్ తెలుగులో రీమేక్ చేశారు. సుధీర్‌ బాబు - నందిత జంట‌గా కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రినీ పేరుతో ఈ సినిమా రీమేకైంది. అయితే ఆశించిన విజ‌యం ద‌క్క‌లేదు. అలాగే మంచు విష్ణు ఎంతో ఇష్ట‌ప‌డి త‌మిళ హిట్ చిత్రం అరిమానంబిని డైన‌మైట్ పేరుతో రీమేక్ చేశారు. దేవ‌క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన డైన‌మైట్ డిజాస్ట‌ర్‌ గా నిలిచింది. విశ్వ‌న‌టుడు క‌మ‌ల్‌ హాస‌న్ ఫ్రెంచి సినిమా స్లీప్ లెస్ నైట్స్ ని చీక‌టిరాజ్యం గా రీమేక్ చేశారు. త‌మిళుడు సెల్వ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ఈ చిత్రం తెలుగులో చ‌క్క‌ని వ‌సూళ్లు రాబ‌ట్టి విజ‌యం ద‌క్కించుకుంది. ఈ ఏడాది మొత్తంలో గోపాల గోపాల‌ - చీక‌టిరాజ్యం తప్ప మిగ‌తావ‌న్నీ అట్ట‌ర్‌ ఫ్లాప్‌ లే.