Begin typing your search above and press return to search.

రీమేక్‌ ల కంటే ఫ్రీమేక్‌ లే ఉత్తమం

By:  Tupaki Desk   |   2 Jan 2023 12:30 PM GMT
రీమేక్‌ ల కంటే ఫ్రీమేక్‌ లే ఉత్తమం
X
ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ముఖ్యంగా ఒకప్పుడు ఒక్క భాషలో సినిమా సక్సెస్‌ అయితే ఆ సినిమాను అన్ని భాషల్లో కూడా రీమేక్ చేసి అన్ని చోట్ల కూడా సక్సెస్‌ లను దక్కించుకున్నారు. అలా కొందరు హీరోలను రీమేక్ హీరోలు అని కూడా అనేవారు. రీమేక్ లు ఒకానొక సమయంలో ఇండస్ట్రీ హిట్స్‌ గా నిలిచిన దాఖలాలు ఉన్నాయి.

ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో ఒక్కరు ఇద్దరు తప్ప దాదాపు అందరు కూడా రీమేక్‌ లను ఏదో ఒక సందర్భంలో చేసిన వారే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. గత రెండు సంవత్సరాలుగా రీమేక్ అయిన సినిమాలు చాలా తక్కువగా సక్సెస్ అయ్యాయి. రీమేక్‌ సినిమాల యొక్క సక్సెస్ రేటు దారుణంగా పడిపోవడానికి కారణం ఓటీటీ అనే వాదన కూడా వినిపిస్తోంది.

ఒక్క భాషలో విడుదల అయిన సినిమా ను అన్ని భాషల్లో కూడా సబ్ టైటిల్స్ తో ప్రేక్షకులు ఓటీటీ లో చూస్తున్నారు. దాంతో వాటినే రీమేక్ చేస్తే జనాలు లైట్ తీసుకుంటున్నారు. రీమేక్‌ పేరుతో ఉన్నది ఉన్నట్లుగా కాకుండా మార్చి తీస్తే అప్పుడు జనాల నుండి ఆదరణ లభిస్తుంది. వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్‌ సినిమాలు ఆ విషయాన్ని నిరూపించాయి.

రీమేక్ ల కంటే కూడా ప్రీమేక్‌ లను చేయడం ఉత్తమం అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా రీమేక్ చేయకుండా ఒక సక్సెస్ సినిమా యొక్క స్టోరీ లైన్ తీసుకుని దాన్ని సోల్‌ మిస్ అవ్వకుండా సాధ్యం అయినంత ఎక్కువ మార్పులు చేర్పులు చేయడం ద్వారా ప్రేక్షకులను అలరించే అవకాశాలు ఉన్నాయి.

చూసిన సినిమా అనే ఫీల్ ఉండదు.. పైగా కొత్త కథ అనే ప్రచారం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ఇప్పటికే కొందరు దర్శక నిర్మాతలు ఫాలో అవుతున్నారు. కానీ ఇంకా ఎక్కువ శాతం మంది ఫిల్మ్‌ మేకర్స్‌ రీమేక్‌ లపై కాకుండా ప్రీమేక్‌ లపై దృష్టి పెడితే బాగుంటుంది. ఈ భాష.. ఆ భాష అని కాకుండా అన్ని భాషల ఇండస్ట్రీ వారు కూడా రీమేక్‌ ల వల్ల ఈ మధ్య కాలంలో తీవ్రంగా నష్టపోయారు.

కనుక ఇక నుండి అయినా రీమేక్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఉత్తమం. మలయాళంలో సూపర్‌ హిట్ అయిన జయ జయ జయ హే సినిమాను సమంత రీమేక్ చేసే ప్లాన్ చేస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో సూపర్‌ హిట్ అయిన తమిళ సినిమా లవ్ టుడే ను బాలీవుడ్‌ లో వరుణ్‌ దావన్‌ రీమేక్ చేయాలని ఆశ పడుతున్నాడట.

ఈ రెండు సినిమాలు కూడా ఓటీటీ లో విచ్చలవిడిగా ప్రదర్శింపబడి సూపర్‌ హిట్‌ అయ్యాయి. భాషతో సంబంధం లేకుండా సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు వాటిని రీమేక్ చేస్తే జనాలు పట్టించుకుంటారా అంటే అనుమానమే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.