Begin typing your search above and press return to search.
మెగా ఫ్యామిలీ ఫోటోలో మేనల్లుళ్లను గుర్తు పడతారా?
By: Tupaki Desk | 19 March 2021 10:30 AM GMTపాత రోజులు మరపురానివి. నాటి జ్ఞాపకాల్ని ఫోటోల రూపంలో పదిలపరుచుకుంటే నేటికీ ఆ మధురస్మృతుల్ని తిరిగి గుర్తు చేస్తుంటాయి. అలాంటి అరుదైన ఫోటో ఒకటి తాజాగా మెగాభిమానుల ముందుకు వచ్చింది. 2000 సంవత్సరం నాటి ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి ఆయన భార్య సురేఖ తో పాటు చిన్నారి రామ్ చరణ్.. పెద్ద కుమార్తె సుస్మిత చిన్న కుమార్తె శ్రీజ తదితరులు ఉన్నారు. ఇంటిల్లిపాదీ ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
ఇటీవల కొంతకాలంగా మెగా ఫ్యామిలీకి చెందిన క్లాసిక్ ఫోటోలు ఫ్యాన్స్ లో వైరల్ అవుతున్నాయి. ఇందులో 1980-90 డికేడ్ లోని ఫోటోలతో పాటు 2000-2010 డికేడ్ ఫోటోలు ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నాయి. తాజా ఫోటోగ్రాఫ్ పవన్ కల్యాన్ `బద్రి` సినిమాలో నటించిన అనంతరం దిగినది అని అర్థమవుతోంది.
ఇందులోనే చిరు తన భార్య శ్రీమతి సురేఖ.. తల్లిదండ్రులతో పాటు సోదరులు నాగబాబు.. పవన్ కల్యాణ్ లతో కలిసి ఉన్నారు. నాగబాబు - పద్మజ.. పవన్ - రేణు దేశాయ్ జంటగా కనిపిస్తున్నారు. చరణ్ పక్కనే వరుణ్ తేజ్.. సాయి ధరమ్ తేజ్.. వైష్ణవ్ తేజ్ కూడా ఉన్నారు. ఇంకా కజిన్స్ కూడా ఈ ఫోటోలో కనిపిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి 1980లో లెజెండరీ నటుడు నిర్మాత అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహమాడిన సంగతి తెలిసిందే. ఆ జంటకు సుశ్మిత- చరణ్ - శ్రీజ వారసులుగా జన్మించారు. పునాది రాళ్లు- ప్రాణం ఖరీదు చిత్రాలతో కథానాయకుడిగా చిరు కెరీర్ మొదలైంది.