Begin typing your search above and press return to search.

రెమో.. అమ్మాయిగా కుమ్మేశాడమ్మో!!

By:  Tupaki Desk   |   20 Sep 2016 5:08 AM GMT
రెమో.. అమ్మాయిగా కుమ్మేశాడమ్మో!!
X
హీరో లేడీ గెటప్ వేసే సినిమాలంటే మన దగ్గర ముందు నుంచే ఆసక్తి రేకెత్తిస్తాయి. లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఇప్పటికే ఇలాంటి సినిమా చేసి చూపించేశాడంటే.. ఈ కాన్సెప్ట్ కి ఉన్న క్రేజ్ అర్ధమవుతుంది. టీవీ యాంకర్ నుంచి హీరోగా ఎదిగిన శివ కార్తికేయన్.. లేడీ గెటప్ తో చేసిన మూవీ రెమో. అక్టోబర్ 7న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయి.. సంచలనాలు సృష్టించేస్తోంది.

శివ కార్తికేయన్.. కీర్తి సురేష్ జంటగా నటించిన రెమో ట్రైలర్ కి గంటల వ్యవధిలోనే 3 లక్షల వ్యూస్-30వేల లైక్స్ వచ్చాయంటే.. ఈ సినిమా క్రేజ్ అర్ధమవుతుంది. రజినీకాంత్ లాగా స్టార్ హీరో అయిపోవాలని అనుకునే కుర్రాడి పాత్రను శివ కార్తికేయన్ పోషించగా.. అతనికి ఓ హాస్పిటల్ నర్స్ గెటప్ వేయాల్సిన అవసరం కల్పిస్తాడో డైరెక్టర్. దీంతో అక్కడ తన ట్యాలెంట్ చూపించడంతో పాటు.. కీర్తి సురేష్ తో ప్రేమ.. రొమాన్స్ కూడా లేడీ గెటప్ లో పండించేస్తూ ఉంటాడు హీరో.

రెండు గెటప్ లలో శివ కార్తికేయన్ నటన సూపర్బ్ గా ఉండగా.. హీరోయిన్ కీర్తి సురేష్ చూడచక్కగా ఆకట్టుకుంది. కుర్రాడితో రొమాన్స్ ని కూడా పండించేసి.. తను గీసుకున్న హద్దులను కొంచెం సడలించినట్లుగా కనిపిస్తోంది. లేడీ గెటప్ లో శివ కుమ్మేస్తే.. కీర్తి ట్యాలెంట్ ప్లస్ అందం ఆడియన్స్ కి బోనస్. దసరాకి రానున్న ఈ మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.