Begin typing your search above and press return to search.
సరిలేరు మీద రెమ్యునరేషన్ రూమర్!
By: Tupaki Desk | 9 Aug 2019 4:23 AM GMTఒక భారీ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు దానికి సంబంధించి ఏవేవో గాసిప్స్ రావడం మాములే. ఫిలిం నగర్ లో వీటి మీద చర్చ జరగడం కూడా సాధారణం. కొన్ని వైరల్ అవుతాయి కొన్ని అక్కడితో ఆగిపోతాయి. ప్రస్తుతం షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుపుకుంటున్న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు గురించి ఇలాంటి టాకే హాట్ టాపిక్ గా మారింది. దాని ప్రకారం దీనికి రెమ్యునరేషన్ గా మహేష్ కు 50 కోట్ల దాకా ముట్టజెబుతున్నారట. అంతే కాదు నాన్ థియేట్రికల్ రైట్స్ లో వచ్చిన ఆదాయంలో 40 శాతం ఇచ్చేందుకు ఒప్పందం జరిగినట్టుగా వినికిడి.
ఈ కారణం వల్లే దిల్ రాజుకు మహేష్ కు చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వచ్చిందని ఇలా నిర్మాత ఆదాయ వనరులన్నింటిలోనూ హీరోలు షేర్ అడిగితే ఇక సినిమాలు తీయడం వల్ల నిర్మాతకు మిగిలేదేమిటి అని దిల్ రాజు ఫీలైనట్టుగా టాక్. ఇది పుకారు కాబట్టి నిజమని నిర్ధారించే అవకాశం లేదు కాని చర్చల్లో అయితే నానుతోంది. డిమాండ్ ఉన్నప్పుడు ఏ స్టార్ హీరో అయినా రెమ్యునరేషన్ తన మార్కెట్ కు తగ్గట్టు అడగడం సహజం. అందులోనూ వంద కోట్ల మార్కెట్ ఉన్న మహేష్ రేంజ్ హీరోలు ఆశించడంలో తప్పేమీ లేదు.
కాని నిజంగా అంత భారీగా తీసుకుంటున్నారా లేక ఇవన్ని ఊరికే ప్రచారంలో వస్తున్న ఫేక్ న్యూసా అనేది చెప్పలేం కాని మహర్షి టైంలోనూ ఇలాంటి కథనాలు కొన్ని చక్కర్లు కొట్టాయి. పవన్ కళ్యాణ్ సినిమాలు చేయనని ప్రకటించాక మహేష్ కు మార్కెట్ పరంగా ఇంకొన్ని అనుకూలతలు చేరాయి. ఒక మాంచి మాస్ మసాలా సినిమా పడాలే కాని ఒక్కడు పోకిరి టైపులో బాహుబలి రికార్డులకే టార్గెట్ పెట్టే సత్తా మహేష్ కు ఉంది. అలాంటి ప్రాజెక్ట్ కోసమే ప్రిన్స్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి సరిలేరు నీకెవ్వరు అది తీరుస్తుందో లేదో చూడాలి