Begin typing your search above and press return to search.
పదేళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న త్రివిక్రమ్ సన్నిహిత నిర్మాణ సంస్థలు..!
By: Tupaki Desk | 9 Aug 2022 1:59 PM GMTటాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' మరియు అనుబంధ సంస్థ 'సితార ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే.. మరోవైపు చిన్న మీడియం రేంజ్ చిత్రాలతో ఇండస్ట్రీకి న్యూ టాలెంట్ ని పరిచయం చేయడానికి తమవంతు కృషి చేస్తున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలన్నీ ఒక బ్యానర్ లో.. మిగతా సినిమాలన్నీ మరో బ్యానర్ మీద నిర్మిస్తూ వరుస విజయాలు అందుకుంటున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ గా.. మంచి అభిరుచి గల నిర్మాతలుగా పేరు తెచ్చుకున్నారు రాధాకృష్ణ (చినబాబు) - సూర్య దేవర నాగవంశీ.
2012 ఆగస్టు 9న విడుదలైన 'జులాయి' సినిమాతో ఘనంగా ప్రారంభించిన హారిక & హాసిని క్రియేషన్స్ మరియు సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు.. నేటితో విజయవంతంగా పదేళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకుంది. ఈ 10 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఈ సంస్థల నుంచి 16 సినిమాలు రాగా.. అందులో మెజారిటీ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడం విశేషం.
అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' మరియు 'సితార ఎంటర్టైన్మెంట్స్' కి ప్రత్యేకమైన అనుబంధముంది. 'జులాయి' నుంచి త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న అన్ని చిత్రాలను సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక సితార బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా యువ ప్రతిభకు పెద్ద పీట వేస్తున్నారు.
గడిచిన పదేళ్లలో ఈ రెండు బ్యానర్స్ లో 'జులాయి' 'సన్నాఫ్ సత్యమూర్తి' 'అఆ' 'ప్రేమమ్' 'అరవింద సమేత వీర రాఘవ' 'జెర్సీ' 'భీష్మ' 'భీమ్లా నాయక్' 'డీజే టిల్లు' 'అల వైకుంఠపురములో' ఇలా పదికి పైగా బ్లాక్ బస్టర్స్ రూపొందాయి. 'శైలజారెడ్డి అల్లుడు' 'బాబు బంగారం' 'రణరంగం' 'అజ్ఞాతవాసి' వంటి పరాజయాలు కూడా ఉన్నాయి.
సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా పదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నిర్మాతలు ఓ వీడియోను విడుదల చేశారు. ఇక ముందు కూడా తమకు అందరి అభిమానం ఆశీస్సులు..ప్రేక్షకుల మద్దతు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
"జులాయితో ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. మీరు ఇచ్చిన ప్రేమ.. ఇలాంటి చిత్రాలను తీయగలమనే నమ్మకాన్ని కలిగించింది. మీరు మాకు విభిన్న చిత్రాలను తెరకెక్కించడానికి.. అనేక భావోద్వేగాలను తెరపై అందించడానికి అవకాశం ఇచ్చారు. ఈ 10 ఏళ్ల ప్రయాణంలో మీ ప్రేమ మరియు మద్దతు మమ్మల్ని మరిన్ని సవాళ్లు స్వీకరించేలా చేశాయి. ఇన్నాళ్ల మీ ప్రేమకు ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఇకపై కూడా ఇలాగే ఉంటుందని.. మరిన్ని అద్భుతమైన చిత్రాలతో మిమ్మల్ని మరింత అలరిస్తామని ఆశిస్తున్నాము" అని నిర్మాతలు ఈ వీడియోలో పేర్కొన్నారు.
అలానే 'హారిక & హాసిని' మరియు 'సితార' సంస్థల నుంచి రాబోయే మరిన్ని చిత్రాలను కూడా ప్రకటించారు. బెల్లంకొండ గణేష్ - వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా 'స్వాతిముత్యం'.. నవీన్ పొలిశెట్టి హీరోగా 'అనగనగా ఒక రాజు' మరియు పంజా వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా చేస్తున్నారు. తమిళ హీరో ధనుష్ ని టాలీవుడ్ కు పరిచయం చేస్తూ 'సార్' మూవీ చేస్తున్నారు.
మహేష్ బాబు - పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకురానున్నారు. అలానే సిద్ధు జొన్నలగడ్డతో 'DJ టిల్లు-2' సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక సూర్య - అర్జున్ దాస్ - అనిఖ సురేంద్రన్ ప్రధాన పాత్రల్లో మలయాళ సూపర్ హిట్ చిత్రం 'కప్పెల' రీమేక్ ను రూపొందిస్తున్నారు.