Begin typing your search above and press return to search.
రేణు దేశాయ్ కూతురు చాలా ఎమోషనల్
By: Tupaki Desk | 15 Oct 2017 10:58 AM GMTమామూలుగా చిన్న పిల్లలు అంటే కాస్త ఆకతాయిగా ఉంటారులే అనుకుంటాం. కాని వారే చాలా ఎమోషనల్ గా ఉంటారు. ఇప్పుడు మాజీ హీరోయిన్ రేణు దేశాయ్ మాటలను వింటుంటే అదే విషయం మనకు అర్ధమవుతుంది. పవన్ కళ్యాణ్ దగ్గర నుండి విడాకులు తీసుకున్న తరువాత రేను పూణె లో తన పిల్లలతో కలసి ఉంటోంది. అయితే ఆ మధ్యన ఆమెకు తీవ్ర అస్వస్థత చేసిందట. ఆ సందర్భంలో జరిగన ఒక సంఘటన తెలిస్తే మనం నిర్ఱాంతపోవాల్సిందే.
పూణెలో ఉంటున్న రేణుకు మరి ఆలోచనల వలనో లేక డిప్రెషన్ వలనో కాని హార్ట్ తాలూకు సమస్య ఏదో వచ్చిందట. దానితో ఆమె కొన్నాళ్ళు మంచానికే పరిమితం అయిపోయింది. ఆ సమయంలో రోజూ ఆద్య.. రేణు బెడ్ దగ్గరకు వచ్చి పక్కనూ కూర్చొని ఏడ్చేదట. ఒక రోజు రేణు చలనం లేకుండా పడిపోవడంతో.. అమ్మా నువ్వు చనిపోవద్దు అమ్మా.. ప్లీజ్ అమ్మా.. మాతో ఉండమ్మా అంటూ బతిమిలాడిందట. రేణు కళ్ళు తెరిచి చూసేసరికి.. నన్ను వదిలేసి వెళ్ళొద్దూ అంటూ ఆమె ఒడిలో పడిపోయిందట ఆద్య. అప్పుడు ఆద్య కళ్ళలో నీరు చూసి రేణుకు కూడా ఏడుపొచ్చిందట. కాని తను కూడా ఏడిస్తే ఆద్య ఇంకా కాన్ఫిడెన్స్ కోల్పోతుంది కాబట్టి.. నేను ఏడుపు కంట్రోల్ చేసుకున్నాను అంటోంది రేణు. ఆ తరువాత వెళ్ళి దేవుడ్ని వేడుకో అంటూ రేణు చెబితే.. అదే తరహాలో చేసేదట. తను కోలుకున్నాక.. అసలు నీ పెళ్ళి చేసి.. నీ పిల్లల్ని పెంచకుండా నేనెక్కిడికిపోతాను అంటూ ఆద్యకు చెప్పిందట.
ఇకపోతే ఇదంతా చెబుతూ.. కొడుకు అకీరా మాత్రం చాలా గుండె నిబ్బరంతో ఉంటాడని.. ఆ సమయంలో స్కూల్ కు వెళ్ళే ముందు రోజూ పొద్దున్నే వచ్చి మాట్లాడేవాడని.. సాయంత్రం వచ్చి మందులు వేసుకున్నావా అని అడిగేవాడని చెప్పింది రేణు. ఇదంతా చెబుతూ.. సింగిల్ పేరెంట్ అంటూ ఎంత కష్టమో అర్ధమైందా అంటూ ఆమె పెళ్ళిచేసుకుంటాను అంటే ఓవర్ యాక్షన్ చేస్తున్న కొందరు మూర్ఖులకు చెప్పకనే చెప్పింది.