Begin typing your search above and press return to search.

జూ. పవర్ స్టార్ వద్దు -రేణు

By:  Tupaki Desk   |   8 April 2017 7:39 AM GMT
జూ. పవర్ స్టార్ వద్దు -రేణు
X
ఇవాళ పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ ల కొడుకు అకీరా నందన్ పుట్టిన రోజు అనే విషయం.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సాధారణంగానే సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండే పవన్ మాజీ వైఫ్.. ఇలాంటి సందర్భంలో మరింత దూకుడుగా ఉంటుంది. కొడుకుపై తన ప్రేమను.. ఫోటోలతో పాటు అక్షరాల రూపంలో అభిమానులకు అందించే ప్రయత్నం చేస్తుంది.

'13.. నా చిన్నారి కొడుకు అప్పుడే 6 అడుగుల టీనేజర్ అయిపోయాడంటే నమ్మలేకపోతున్నా. నా బుల్లి బాబుకి అప్పుడే 13 ఏళ్లు అనే ఆలోచనకే కనీసం మాటలు కూడా రావడం లేదు. ఇవాల్టి రోజున తన కోసం ప్రత్యేకంగా ప్రార్ధిస్తాను. ఈ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన విలక్షణమైన స్థానం లభించాలని.. పేరెంట్స్ నీడల్లో తనను తాను కోల్పోకుండా ఉండాలని కోరుకుంటున్నా. జూనియర్ పవర్ స్టార్ అని కాకుండా.. అకీరా నందన్ అంటూ తన సొంతగానే గుర్తింపు సాధించగలడని నమ్మతున్నాను. హ్యాపీ బర్త్ డే మై లిటిల్ స్వీట్ హార్ట్ అకీరా' అంటోంది రేణు దేశాయ్.

జూనియర్ పవర్ స్టార్ వద్దు అంటే.. పవన్ ఫ్యాాన్స్ ఫీలవచ్చు కానీ.. పవర్ స్టార్ వారసుడు అని కాకుండా.. సొంతగా తన కొడుకు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని.. తల్లి మనసు కోరుకోవడంలో తప్పేమీ లేదు. తన పేరు చెప్పాల్సిన పని లేనంతటి స్థాయికి కొడుకు ఎదిగితే.. అది తండ్రి పవన్ కళ్యాణ్ కూడా గర్వ కారణమే కదా.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/