Begin typing your search above and press return to search.

పవన్ మూడో పెళ్లిపై రేణు సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   7 July 2018 11:48 AM GMT
పవన్ మూడో పెళ్లిపై రేణు సంచలన వ్యాఖ్యలు
X
పవన్ కళ్యాణ్ గురించి తాను ఎప్పడూ నెగెటివ్ కామెంట్స్ చేయనంటూ మొన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది రేణు దేశాయ్. కానీ ఈ రోజు ఆమె పవన్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఎప్పుడూ పవన్ మూడో పెళ్లి మీద ఏ వ్యాఖ్యా చేయని రేణు.. తొలిసారిగా ఆ వ్యవహారంపై కామెంట్ చేసింది. ఆమె కొంచెం తీవ్రంగానే స్పందించింది.

తనతో 11 ఏళ్ల పాటు జీవితాన్ని పంచుకున్న వ్యక్తి.. తనకు తెలియకుండానే మరో మహిళతో బిడ్డను కనేశాడని రేణు వ్యాఖ్యానించింది. పవన్ కళ్యాణ్ ను విపరీతంగా అభిమానించే మహిళలు ఒక్కసారి తన స్థానంలో ఉండి ఆలోచిస్తే తన బాధేంటో అర్థమవుతుందని ఆమె వ్యాఖ్యానించింది. రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న పవన్ కళ్యాణ్ కు ఈ వ్యాఖ్యలు ఎంతగా నష్టం కలిగిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పర్టికులర్ గా మహిళల గురించి ప్రస్తావించి రేణు ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.

ఇంతకుముందు పవన్ విషయంలో.. పవన్ అభిమానుల విషయంలో కొంచెం సంయమనంతోనే ఉండేది రేణు. కానీ తాను మరో పెళ్లికి సిద్ధమవుతున్న తరుణంలో పవన్ అభిమానులు తనను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో రేణు ఇక ఆలౌట్ వార్‌ కు రెడీ అయినట్లే ఉంది. ఇక పవన్ ను కానీ.. ఆయన అభిమానుల్ని కానీ ఎంతమాత్రం ఉపేక్షించకూడదని ఆమె డిసైడైనట్లే ఉంది. బీబీసీ తెలుగు వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం పవన్ కు పంచ్ ఇచ్చేలాగే మాట్లాడిందామె. పవన్ నుంచి విడిపోయాక ఒంటరి జీవితంతో తానెంత వేదన అనుభవించానో చెబుతూ.. ఆయన నుంచి భరణం కింద ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పడం ఆమెపై జాలి కలిగిస్తూ.. పవన్ మీద నెగెటివ్ ఫీలింగ్ తెచ్చే విషయమే.