Begin typing your search above and press return to search.

వినాయకుడు ఐటెం సాంగ్స్ పెట్టమన్నాడా ?

By:  Tupaki Desk   |   27 Sep 2015 7:39 AM GMT
వినాయకుడు ఐటెం సాంగ్స్ పెట్టమన్నాడా ?
X
హైద్రాబాద్ లో గణేషుడి నిమజ్జనానికి ఎంత హడావిడి ఉంటుందో మనకు తెలుసు. అయితే.. మహరాష్ట్రలో కూడా వినాయక చవితిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా ముంబై - పూనేల్లో ఈ ఉత్సవాలు అంబరాన్ని అంటుతాయి. ఈ సమయంలో భక్తుల కోలాహలం మామూలుగా ఉండదు.

ఇలా వినాయకుడి నిమజ్జనం రోజున చేసే శృతిమించిన హడావిడిపై పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ ఫైర్ అయింది. గణేషుడి మీద భక్తిని నిరూపించుకునేందుకు ఐటమ్ సాంగ్స్ అవసరమా? అంటోంది రేణు దేశాయ్ దీనికి కారణం.. నిమజ్జనం సందర్భంగా చెవులు హోరెత్తిపోయేలా లౌడ్ స్పీకర్లతో పాటలు పెట్టడం, అది కూడా ఐటెం సాంగ్స్ ప్లే చేసి హడావిడి చేయడంతో. తన కూతురు ఆద్య నిద్రపోలేకపోయింది. లౌడ్ స్పీకర్లలో ఐటమ్ సాంగ్స్ తో జరిగిన హంగామా అవసరమా అంటూ ట్విట్టర్ లో ప్రశ్నించింది రేణు.

పవర్ స్టార్ తో విడిపోయిన తర్వాత.. అకిరా - ఆద్యలతో కలిసి రేణు దేశాయ్ ప్రస్తుతం పూణెలో ఉంటోంది. తన చిన్నారి ఇబ్బంది పడ్డంతో ప్రశ్నించింది కానీ.. ఈ క్వశ్చన్ లో అర్ధం చేసుకోవాల్సిన వాస్తవం చాలా ఉంది. భక్తి పేరుతో ఐటెం సాంగ్స్ పెట్టుకుని అసభ్యకర నృత్యాలు చేసే సంస్కృతిని వినాయకుడు మాత్రం హర్షిస్తాడంటారా ?