Begin typing your search above and press return to search.
తోడు కోరుకుంటే తప్పేనా? -రేణు దేశాయ్
By: Tupaki Desk | 4 Oct 2017 4:10 AM GMTమాట్లాడే దాన్లో ఒక న్యాయం ఉండాలి. అభిమానం పేరుతో ఇష్టారాజ్యంగా మాట్లాడటం ఏ మాత్రం మంచిది కాదు. కానీ.. సోకాల్డ్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మాత్రం తాము మాట్లాడే దాన్లో అర్థం ఉందా? లేదా? అన్న విషయాన్ని సైతం పట్టించుకోని తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ పవన్ ఫ్యాన్స్ గురించి ఎందుకిదంతా అంటారా? అక్కడికే వస్తున్నాం.
పవన్ కల్యాణ్.. రేణు దేశాయ్ విడిపోయి చాలాకాలమే అయ్యింది. ఏళ్లు గడిచిపోయాయి అంటే బాగుంటుంది. రేణుదేశాయ్ తో విడాకుల తర్వాత గుట్టుచప్పుడు కాకుండా పవన్ మూడో పెళ్లి చేసుకున్నారు. మీడియాలో అదే పనిగా పవన్ మూడో పెళ్లి మీద వార్తల మీద వార్తలు వచ్చిన తర్వాత కానీ స్పందించి..పెళ్లి మాట అవునన్నారు.
దీన్ని ఇలా కట్ చేస్తే.. విడిపోయినప్పటికీ మంచి స్నేహితులుగా ఉన్నామంటూ రేణు చెప్పేది. తనకిప్పటికీ పవనే బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెప్పేది.
పవన్ పెళ్లి చేసుకుంటే.. రేణు మాత్రం పవన్ తో గడిపిన కాలాన్ని గుర్తు చేసుకుంటూ ఒంటరిగానే ఉండిపోయింది. ఇన్నాళ్ల తర్వాత ఆమె నోటి నుంచి రెండో పెళ్లి గురించిన ఆలోచన వచ్చింది. ఆ విషయాన్ని దాచి పెట్టుకోకుండా ఒక ఇంటర్వ్యూలో చెప్పటమే కాదు.. దాని వెనుక ఉన్న కారణం కూడా చెప్పింది. తనకీ మధ్య ఆరోగ్యం బాగోలేదని.. అర్థరాత్రి రెండు గంటల వేళ.. తన సోదరి తన ఇంటికి వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లిందని చెప్పారు.
అనారోగ్యంగా ఉన్న వేళ.. తనను.. పిల్లల్ని చూసుకోవటానికి ఒకరు ఉంటే బాగుండేదనిపించిందని.. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనను బయటపెట్టారు. తాను ఇలా అనుకున్నా.. దేవుడు ఏం అనుకున్నాడో? ఏం చేస్తాడో? అని వ్యాఖ్యానించింది.
రేణు మాటలకు పలువురు అయ్యో అనుకున్నారు. అంత అనారోగ్యంగా ఉన్న రేణును బెస్ట్ ఫ్రెండ్ పవన్ ఎందుకు సాయంగా నిలవలేదన్నమాట పలువురిలో అనిపించింది. ఇదిలాఉంటే.. పవన్ ఫ్యాన్స్ లో కొందరికి మాత్రం రేణు మాటలు అస్సలు నచ్చలేదు. రెండో పెళ్లి గురించి ఆలోచన చేయటం ఏమిటన్నట్లుగా సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా మాట్లాడేయటం మొదలెట్టారు.
కామెంట్ల రూపంలో తనను తప్పు పడుతున్న పవన్ ఫ్యాన్స్ కు ఘాటు రిప్లై ఇచ్చారు రేణుదేశాయ్. ఓ మగాడు ఏమైనా చేయొచ్చు.. ఆడది మాత్రం మీకు నచ్చినట్లే ఉండాలా? ఆమెకు వ్యక్తిత్వం ఉండదా? ఆమెకూ ఓ తోడు కావాలన్పించకూడదా? అంటూ సోషల్ మీడియాలో ఘాటు కౌంటర్ ఇచ్చేసింది. నిజమే.. రేణు అన్న మాటలోనూ అర్థం ఉంది కదా. పవన్ ఏమీ ఒంటరిగా ఉండలేదు కదా. వెంటనే పెళ్లి చేసుకున్నాడు కదా. నిజానికి ఇంతకాలం సింగిల్ మదర్ గా ఉంటూ ఇంటి బాధ్యతను.. పిల్లల బాధ్యతను తీసుకున్నందుకు. అభిమానం పేరుతో తమ మేల్ ఇగోను ప్రదర్శిస్తూ.. ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసే వారికి రేణు ఘాటు కౌంటర్ ఇచ్చారనే చెప్పాలి. అయినా.. తన పిల్లలు ఇద్దరికి తల్లిగా ఉంటూ.. తనకు స్నేహితురాలిగా ఉన్న రేణుకు అనారోగ్యంగా ఉంటే పవన్ ఎందుకు అండగా నిలవలేదు. ఎవరికి ఏం జరిగినా వెంటనే రియాక్ట్ అవుతుంటారంటూ పవన్ గురించి చెబుతుంటారు. ఒకప్పటి భార్య.. ఇప్పటికి మంచి స్నేహితురాలైన రేణు అనారోగ్యం విషయంలో పవన్ ఎందుకు పట్టనట్లుగా ఉండటం ఎందుకు?