Begin typing your search above and press return to search.

ఇంత జ‌రుగుతున్నా... రేణు స్పందించ‌దే?

By:  Tupaki Desk   |   18 April 2018 1:09 PM GMT
ఇంత జ‌రుగుతున్నా... రేణు స్పందించ‌దే?
X
ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో భార్య‌గా విడిపోయానే త‌ప్ప స్నేహితురాలిగా కాదంటూ చాలా స్టేట్ మెంట్‌లు ఇచ్చింది రేణు దేశాయ్‌. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ప‌వ‌న్ పై అభిమానాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టిస్తూనే ఉండేది. విడిపోయాక కూడా ప‌వ‌న్‌పై ఎందుకు ప్రేమ కురిపిస్తున్నావంటూ అభిమానులు అడిగిన సంద‌ర్భాలు.... అది త‌న హ‌క్క‌ని ఆమె ఘాటుగా స్పందించిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. చీటికీ మాటికీ ట్విట్ట‌ర్‌లో ప‌వ‌న్ గురించి ఏదో ఒక ట్వీటు పెట్టే రేణు దేశాయ్ ఇప్పుడు మాత్రం ఒక్క ట్వీటు పెట్ట‌లేదు. ప‌దిరోజులుగా ఆ ట్విట్ట‌ర్ ఖాతాలో ఒక్క ట్వీటు ప‌డ‌లేదు. ప‌వ‌న్ గురించి బ‌య‌ట ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నా ఆమె ఎందుకు స్పందించ‌డం లేదు అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు అమ్మ‌యిలంటే చుల‌క‌న భావ‌మ‌ని కొంద‌రు కామెంట్లు చేశారు. మ‌రికొంద‌రు అమ్మాయిల‌తో మ‌సాజ్ చేయించుకునే అలవాటు అత‌నికి ఉందంటూ దారుణ‌మైన ఆరోప‌ణ‌లు చేశారు. శ్రీరెడ్డి ఏకంగా వేలు చూపించి అస‌భ్యంగా మాట్లాడింది. ప‌వ‌న్ మాత్రం ఈ విష‌యాల‌పై అస‌లు స్పందించ‌లేదు. అత‌నికి మ‌ద్ద‌తుగా నితిన్ సాయిధ‌ర‌మ్ తేజ్ వ‌రుణ్ తేజ్ వంటి యంగ్ హీరోల‌తో పాటూ మా స‌భ్యులు కూడా స్పందించారు. హేమ నాగ‌బాబు లాంటి వారు చాలా ఘాటుగా స్పందించారు. ఇంత‌మంది ఈ క‌ష్ట‌కాలంలో ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా ఉన్న‌ప్ప‌టికీ రేణు మాత్రం ఒక్క ట్వీట్ కూడా చేయ‌లేదు. అత‌ని భార్య‌గా ఎన్నో ఏళ్లు సావాసం చేసిన వ్య‌క్తిగా ప‌వ‌న్ గురించి ఆమెకు బాగానే తెలుసు. అమ్మాయిల ప‌ట్ల అత‌ని ప్ర‌వ‌ర్త‌న ఎలా ఉంటుందో ఆమె క‌న్నా ఇంకెవ‌రికీ తెలియ‌క‌పోవ‌చ్చు. అలాంటి వ్య‌క్తే మౌనంగా ఉండ‌డం చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎన్నో విమ‌ర్శ‌లకు తావిస్తోంది.

పవ‌న్ పై జ‌రుగుతున్న ర‌చ్చలోకి తాను ఎంట‌రైతే... రియాక్ష‌న్ గ‌ట్టిగా ఉంటుంద‌ని కూడా రేణు భ‌య‌ప‌డి ఉండొచ్చ‌ని కొంద‌రి అంచ‌నా. తాను ఎంట‌రై విష‌యాన్ని పెద్ద‌దిగా చేయ‌డం అన‌వ‌స‌ర‌మ‌ని ఆమె భావించి కూడా ఉండ‌వ‌చ్చు. కార‌ణం ఏంటో తెలియ‌దు కానీ రేణు దేశాయ్ మౌన‌వ్ర‌తం వెనుక బ‌లమైన కార‌ణం ఏదో ఒక‌టి ఉండే ఉంటుంది.