Begin typing your search above and press return to search.

సమాజంలో కులమే బ్రేకప్స్ కి ప్రధాన కారణం!

By:  Tupaki Desk   |   2 May 2020 5:30 PM GMT
సమాజంలో కులమే బ్రేకప్స్ కి ప్రధాన కారణం!
X
సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీలు తమ అభిమానులకు సులభంగా దగ్గరవుతున్నారు. లాక్‌ డౌన్ పరిస్థితుల్లో సోషల్ సోషల్ మీడియానే దిక్కని భావిస్తున్న సెలబ్రిటీలు మాట్లాడుతూ.. అనేక విషయాలను పంచుకుంటున్నారు. తాజాగా లాక్‌డౌన్లో ఉన్న రేణుదేశాయ్ తన అభిమానులతో లైవ్ కార్యక్రమాన్ని ముచ్చటించారు. లైవ్ లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబిచ్చారు. మొదటగా లవ్ గురించి మాట్లాడుతూ.. లవ్ అనేది చాలా కాంప్లికేటేడ్. దానిలో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. లవ్ బ్రేకప్ అనేది ఒక్కొక్కరికి ఒక్కో కారణంతో అవుతుంది. మనకు లవ్ ఎమోషన్స్ గురించి ఫ్యామిలీలో - పాఠశాలలో చెప్పరు. ఎన్నో చరిత్రల గురించి చెబుతారు కానీ భావోద్వేగాల గురించి చెప్పరని రేణుదేశాయ్ అన్నారు.

ఇక బ్రేకప్ గురించి స్పందిస్తూ.. లవ్ బ్రేకప్ అనేది చాలా కష్టమైన ఫీలింగ్. దానిని తట్టుకోవాలంటే మానసిక ధృడత్వం అవసరం. వైద్యులు ఉన్నా కూడా బ్రేకప్ నుంచి బయటపడాలంటే మన కృషి కావాలి. ఆ బాధ నుంచి నేను బయటపడ్డాను. మనిషిని ఇలాంటి సంఘటనలు మానసికంగా బాధిస్తాయి. ఏదైనా జరగకూడని విషయం జరిగితే దాని గురించి చాలా ఆలోచిస్తాం. ఎక్కువగా ఆలోచిస్తే మానసికంగా క్షీణించిపోతాం. అలాంటి టైంలో పాజిటివ్ విషయాలపై దృష్టిపెట్టాలి. ఇష్టమైన పనులు చేయాలనీ రేణు తెలిపారు. ఇక సమాజంలో నెగిటివిటీ ఎదుర్కోవడం అనేది కష్టమైన విషయం. సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతుంటాయి. పట్టించుకోకూడదు. అంతేగాని వాటిపై స్పందిస్తే సమస్య పెద్దదిగా మారే అవకాశం ఉంటుంది. ఇక సమాజంలో కులం అనేది అనేక సమస్యలకు కారణం. కుల ప్రభావంతోనే ప్రేమలో వైఫల్యాలు జరుగుతున్నాయి. కులాన్ని ఎదురించే మార్పులు రావాలని రేణుదేశాయ్ చెప్పుకొచ్చారు.