Begin typing your search above and press return to search.
పవన్ ఫ్యాన్స్ కు రేణూ దిమ్మ తిరిగే పంచ్!
By: Tupaki Desk | 13 July 2018 7:57 AM GMTతమకు నచ్చినోళ్ల మీద ఈగ వాలితే సహించని వైనం అందరిలో ఉన్నదే. కాకుంటే.. పవన్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ విషయంలో మరెవరూ పోటీ రారు. తమ ఆరాధ్య దైవాన్ని ఎవరేమన్నా సరే.. వారు ఊరుకోరు. ఎంతలా అంటే.. మొన్నటి వరకూ వదిన.. వదిన అంటూ రేణూను అభిమానించే వారు సైతం.. ఆమె నోరు విప్పి నిజం చెప్పిన వెంటనే జీర్ణించుకోలేకపోవటమే కాదు.. ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం షురూ చేశారు.
ఈ మద్యన టీవీ 9 స్వప్నకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ వివాహ బంధం ఉన్నప్పుడే పొలినా గర్భధారణ జరిగినట్లుగా చెప్పటం సంచలనంగా మారింది. ఇదే విషయాన్ని మరోలా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణూ మరోలా చెప్పటం కనిపిస్తుంది.
పవన్ కు పాప పుట్టినప్పుడు తాను శుభాకాంక్షలు చెప్పినట్లుగా పేర్కొన్నారు. అయితే..ఈ రెండింటి మధ్య కొత్త లాజిక్కులు బయటకు తీసిన పవన్ ఫ్యాన్స్ ను ఒకప్పటి తమ వదినమ్మ రేణూపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో రేణూపై తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు. విడాకులకు.. పాప పుట్టిన నాటికి మధ్య కాలాన్ని లెక్క కట్టి.. రేణూ అబద్ధం చెప్పినట్లుగా తేలుస్తూ.. ఆమెపై నిందలు వేయటం మొదలెట్టారు.
ఏమనుకున్నారో ఏమో కానీ.. పవన్ ఫ్యాన్స్ ట్రోల్ ను రేణూ సహించలేకపోయారు. ఈ సారి ఆమె మరింత క్లారిటీ ఇస్తూ.. తానేం అబద్ధం చెప్పలేదన్నట్లుగా వివరణ ఇచ్చారు. రేణూ తాజా వివరణను చూస్తే.. పవన్ తప్పు చేసినట్లుగా కనిపించక మానదు. బేబీ పోలినా పుట్టిన తేదీకి తమ విడాకులకు మధ్య వ్యత్యాసం చూపించటం ఆసక్తికరంగా మారింది.
స్వప్నకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బేబీ పుట్టిన సంగతి తెలీదని చెప్పటం.. అంతకు కొద్ది నెలల ముందు ఆంధ్రజ్యోతి ఆర్కేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాప పుట్టిన విషయం తెలిసి తాను కంగ్రాట్స్ చేశానని చెప్పటంపై వైరుధ్యాలు ఉన్నప్పటికీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లల మీద ప్రభావం పడేలా వారి పుట్టుకపై సోషల్ మీడియాలో భారీగా చర్చ జరగటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకాలం కొన్ని విషయాల మీద గుట్టుగా ఉన్న రేణూ.. ఇప్పుడు ఓపెన్ కావటం..కొన్ని అంశాల్ని ప్రస్తావించటం కూడా సరికాదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఒకరకంగా చూస్తే.. ఒకవైపు పవన్ ఫ్యాన్స్.. మరోవైపు రేణూ.. ఆమెను అభిమానించే వారు మాట్లాడుతున్నది మూడో మనిషి.. అది కూడా చిన్న పాప గురించి.. ఆమె పుట్టుక గురించి అన్నది మర్చిపోకూడదు. ఇదేమంత సరైనది కాదని చెప్పక తప్పదు. ఇప్పటికైనా ఈ వివాదాన్నిఇక్కడితో ముగిస్తే మంచిదన్నది పలువురు భావన. మరో ఇంటికి వెళ్లాలనుకున్న రేణూ..గతాన్ని అదే పనిగా తవ్వుకోవటం అంత బాగోదేమో?