Begin typing your search above and press return to search.
అకీరా అందుకే అలిగాడట!
By: Tupaki Desk | 26 Jun 2018 4:50 AM GMTసినిమా రంగంతో నేరుగా సంబంధం లేని ఒక వ్యక్తి రెండో పెళ్లి గురించి ఇంత చర్చ జరగడం బహుశా ఐదే మొదటిసారి కావొచ్చు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన నిశ్చితార్థం ఫోటోను షేర్ చేసుకున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో చర్చ ఇంతకీ తెగటం లేదు. దానికి తోడు ఈ వివాహం గురించి రకరకాల కథనాలు ప్రచారంలోకి రావడంతో సైలెంట్ గా ఉంటే ఇవి ఇంకా పాకిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన రేణు దేశాయ్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్పందించే ప్రయత్నం చేసింది.
ముఖ్యంగా అకీరాకు ఈ పెళ్లి ఇష్టం లేదు కాబట్టే ముభావంగా ఉన్నాడని అందుకే వేడుక పూర్తి కాగానే విజయవాడలో ఉన్న నాన్న దగ్గరకికి వచ్చేసాడని ఎవరి చిత్తానికి వారు కథలు అల్లేశారు. దీని గురించి రేణు దేశాయ్ క్లారిటీ ఇస్తూ అకీరా పరిణితి చెందిన టీనేజర్ అని అలా తన పెంపకం అతన్ని తీర్చిదిద్దిందని తన బాబు మీద వస్తున్న కామెంట్స్ ని ఖండించేసింది.
అకీరా ఎంతో ఇష్టపడే పన్నీర్ బటర్ మసాలాను ఆ రోజు మెనూలో పెట్టకపోవడం వల్ల అలా ముభావంగా కనిపించాడు తప్ప వేరొకటి కాదని చెప్పింది. అంతే కాదు ఆడవాళ్ళ గురించి అర్థం లేని కామెంట్స్ పెట్టే కొందరి లాగా అకీరా ఆలోచనా ధోరణి ఉండదని పరోక్షంగా తన మీద మాటల దాడి చేసిన కొందరు అభిమానులను ఉద్దేశించి చెప్పింది. అంతే కాదు తల్లులు కొడుకులు అకీరాను ఆదర్శంగా తీసుకోవాలని కూడా తేల్చేసింది. కొడుకు మీద ప్రేమ కాబట్టి ఇలా చెప్పుకోవడం సహజం.
ఇక అకిరా అదే రోజు విజయవాడకు వచ్చేయడానికి కారణం మాత్రం వేరేగా కనిపిస్తోంది. నాన్న పవన్ కు ఏదో అత్యవసర కంటి సర్జరీ జరిగే అవకాశం ఉందని తెలియడంతో పక్కన ఉండటం కోసమే అకీరా వచ్చాడు తప్ప ఇంకే కారణం లేదని ఇన్ సైడ్ టాక్. అమ్మని అమితంగా ప్రేమించే అకీరాలో రేణు కాదంటున్నా సరే ఫాన్స్ మాత్రం ఫ్యూచర్ పవన్ ని చూసుకుంటున్నారు. అవును మరి ఇప్పుడు 15 వయసున్న అకీరా మరో ఐదారేళ్లలో హీరో అయిపోవచ్చు. అదే ఇప్పటి పవన్ భార్య అన్నా ద్వారా కలిగిన మగ సంతానం హీరో కావాలంటే పాతికేళ్ళు ఆగాలి. లాజిక్ ఉందిగా.