Begin typing your search above and press return to search.

రేణు దేశాయ్‌ ఎమోషన్‌ ఆపుకోలేక..

By:  Tupaki Desk   |   9 Jun 2015 11:30 AM GMT
రేణు దేశాయ్‌ ఎమోషన్‌ ఆపుకోలేక..
X
ఒక్కటి మాత్రం స్పష్టం.. పవన్‌ కళ్యాణ్‌ను రేణు దేశాయ్‌ అస్సలు మరిచిపోలేకపోతోంది. ఆమెకిష్టం లేకుండానే విడాకులు తీసుకుంది. తప్పనిసరి పరిస్థితుల్లోనూ పవన్‌కు దూరంగా ఉంటోంది. ఇప్పటికే ఆమె చేసిన చాలా వ్యాఖ్యలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఇప్పుడు మరోసారి తన సోషల్‌ నెట్‌వర్కింగ్‌ పేజీలో పవన్‌తో బంధం తెంచుకోవడంపై, ఆ తర్వాతి జీవితంపై తన ఉద్వేగాన్నంతా బయటపెట్టేసింది రేణు.

''పురుషుడి రెండో పెళ్లికి పిల్లలు అడ్డం కారు. కానీ మహిళ రెండో వివాహానికి పిల్లలు అడ్డంకిగా నిలుస్తారు. ఓ స్త్రీ తల్లి అవగానే తన భావోద్వేగాలన్నీ అణిచేసుకోవాలి. నేనోసారి ప్రేమలో పడ్డాను. ఇంకెప్పుడూ ఆ పని చేయను, చేయలేను'' అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడింది రేణు. ఈ మాటలు ఎవర్ని ఉద్దేశించిననో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

గతంలో ఓసారి ఇలా వరుసగా పవన్‌ను ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడుతూ.. అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న రేణు.. ఓ సందర్భంలో ఇంకెప్పుడూ పవన్‌ ప్రస్తావన తీసుకురానని అంది. కానీ ఎమోషన్‌ ఆపుకోలేక పరోక్షంగా అయినా పవన్‌ ప్రస్తావన తెస్తూనే ఉంది. మరి ఈసారి పవన్‌ అభిమానులు ఎలా స్పందిస్తారో!