Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: ప్రేమలో పడిన రేణు దేశాయ్!
By: Tupaki Desk | 26 Jan 2021 8:46 AM GMTరేణు దేశాయ్ తన రెండో పెళ్లి గురించి ప్రస్థావించి ఇదివరకూ పవన్ అభిమానుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసినదే. వారు తమ అభిమాన హీరోకు మాజీ భార్య కావడం వల్ల రేణును ఆ కోణంలో చూడలేమని ఖరాకండిగా చెప్పారు. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికలపై రేణు దేశాయ్ తన స్వేచ్ఛా భావాల్ని యథేచ్ఛగా ఆవిష్కరించడం సంచలనమే అయ్యింది.
రేణు ఆ ఘటనలో తన బాధను నిరభ్యంతరంగా వ్యక్తం చేశారు. తరువాత ఆమె రెండవ వివాహం గురించి మాట్లాడలేదు. తాజాగా మరోసారి ఆమె ప్రేమలో ఉన్నానని అధికారికంగా మనసు విప్పడం వేడెక్కిస్తోంది. కానీ ఈసారి తన ప్రేమ ఎవరిపై అంటే... పెంపుడు కుక్కపై అని తెలిసింది. ఆ పెట్ డాగ్ పేరు ప్లూటో. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రకటించడంతో పవన్ అభిమానుల్లోనూ వైరల్ అవుతోంది. అక్కినేని అమల.. త్రిష లానే రేణు పెంపుడు జంతువులతో సమయం స్పెండ్ చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఉంటారు.
రేణు దేశాయ్ ప్రస్తుతం బుల్లితెర షోలతో పాటు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం ఉంది. అలాగే కుమారుడు అకీరానందన్ ని హీరోని చేయాలన్నది తన ప్లాన్. అడవి శేష్ నటిస్తున్న మేజర్ లో పవన్-రేణు జంట వారసుడు అకీరా నటిస్తున్నారని ఇంతకుముందు ప్రచారమైంది. కానీ దానిని అధికారికంగా కన్ఫామ్ చేయలేదు. అలాగే కుమార్తె ఆద్య ప్రస్తుతం స్టడీస్ ని కొనసాగిస్తోంది.