Begin typing your search above and press return to search.

రేణుకి పవన్ పువ్వు పెట్టాడా?

By:  Tupaki Desk   |   3 Nov 2015 4:02 AM GMT
రేణుకి పవన్ పువ్వు పెట్టాడా?
X
ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ బాగా యాక్టివ్ అని సోషల్ నెట్వర్కింగ్ జనాలకు బాగానే తెలుసు. అయితే.. ఇప్పుడామె ఓ క్విజ్ లాంటిది వదిలేసింది. చేతికో ఫ్లవర్ డిజైన్ ఉన్న ఉంగరం తొడిగి ఓ ట్వీట్ పెట్టింది రేణు. అదే ఇప్పుడు జనాలకు పజిల్ అయిపోయింది.

'ఉంగరం వేలికి ఉన్న పవ్వుల డిజైన్ రింగ్ ని.. ఆమె మదిలో ఉన్నవారే ఇచ్చారు' ఇదీ రేణు దేశాయ్ ట్వీట్. ఉంగరాన్ని బాగానే ఫోకస్ చేసి ఫోటో తీసింది. సింపుల్ రాసినా.. బోలెడు అర్ధమచ్చేలా ట్వీట్ చేసింది. అయితే.. ఉంగరం ఎవరిచ్చారో మాత్రం చెప్పలేదు రేణు. గుండెల్లో ఉన్నవాడు అని చెప్పాక.. మళ్లీ పేరు చెప్పాలా అనుకుంటున్నారు నెటిజన్లు. వదినా.. అన్నయ్య రింగ్ ఇచ్చాడా అంటూ క్వశ్చన్స్ వేసేస్తున్నారు. పజిల్ మాత్రం రేణు విప్పడం లేదు. మరి ఎవరిచ్చారు అనే ప్రశ్నకి రేణు ఆన్సర్ ఇస్తుందో.. లేక ఊహించుకోమని మనకే ఆప్షన్ వదిలేస్తుందో చెప్పలేం.

ఏదేమైనా మరో తన ట్వీట్లతో ఎప్పుడూ అలరించి.. మెదడుకు పదును పెట్టే రేణు.. ఇప్పుడు మరోసారి అదే పని చేసింది. రింగులో ఫింగర్‌ రేణుదే.. మరి రింగ్‌ ఎవరిది అంటూ ఇప్పుడు సినిమా అభిమానులందరూ జుట్టు పీక్కుంటున్నారు.