Begin typing your search above and press return to search.

పవన్ గురించి మాట్లాడమంటారు.. మాట్లాడితే తిడతారు

By:  Tupaki Desk   |   15 April 2021 9:30 AM GMT
పవన్ గురించి మాట్లాడమంటారు.. మాట్లాడితే తిడతారు
X
రేణు దేశాయ్ మరోసారి సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో చిట్‌ చాట్‌ చేశారు. ఈ సారి తన కూతురు ఆద్యతో కలిసి ఇన్‌ స్టా గ్రామ్‌ లైవ్‌ లోకి వచ్చిన రేణు దేశాయ్ పలు వ్యక్తిగత వృత్తి పరమైన మరియు పిల్లలకు సంబంధించిన విషయాలను షేర్‌ చేసుకున్నారు. పలు ప్రశ్నలకు కూతురుతో కలిసి రేణు దేశాయ్‌ సరదాగా సమాధానాలు ఇచ్చారు. ఇక కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ప్రతి ఒక్కరు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది. ఈ మొత్తం చిట్‌ చాట్‌ వ్యవహారం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

అకీరా గురించి ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా రేణు దేశాయ్‌ మాట్లాడుతూ.. అకీరాకు సోషల్‌ మీడియా అకౌంట్స్‌ ఉంటాయి. కాని అవన్నీ కూడా ప్రైవేట్‌ గానే ఉంటాయి. స్నేహితులు మాత్రమే వాటిని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. అకీరాకు తన సోషల్‌ మీడియా అకౌంట్స్‌ పబ్లిక్‌ చేయడం ఇష్టం లేదు. ఎప్పుడు కూడా అతడు ప్రైవేట్‌ జీవితాన్ని కోరుకుంటున్నాడు అంటూ రేణు దేశాయ్‌ పేర్కొంది. ఇక కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చూసుకోవాలని చెప్పింది.

ఇదే సమయంలో ఒక అభిమాని పవన్‌ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి అంటూ కోరగా.. ఆ సమయంలో రేణు కాస్త విభిన్నంగా రియాక్ట్‌ అయ్యింది. ఆయన గురించి ఏం మాట్లాడమంటారండి.. నా లైవ్‌ కు వచ్చి కూడా మీరు ఆయన గురించిన మెసేజ్‌ లు పెడుతున్నారు. సరే అని నేను ఆయన గురించి మాట్లాడితే రేణు కి ఏం పని లేదు. ఎప్పుడు ఆయన గురించే మాట్లాడుతుందంటూ మళ్లీ మీరే తిడతారు. మీరు అడిగారని ఏదో ఒక విషయం మాట్లాడితే నన్ను ట్రోల్‌ చేస్తారంటూ రేణు దేశాయ్‌ అసహనం వ్యక్తం చేసింది. అసలు లైవ్‌ కు రావాలంటేనే కష్టంగా ఉందని రేణు దేశాయ్‌ పవన్ గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.