Begin typing your search above and press return to search.

అకిరా డెబ్యూ పై రేణుదేశాయ్ స్ట్రాంగ్ రిప్లై..!

By:  Tupaki Desk   |   26 May 2021 4:30 AM GMT
అకిరా డెబ్యూ పై రేణుదేశాయ్ స్ట్రాంగ్ రిప్లై..!
X
సినీ ఇండస్ట్రీలో సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీలు తమ అభిమానులకు సులభంగా దగ్గరవుతున్నారు. లాక్డౌన్ పరిస్థితుల్లో సోషల్ సోషల్ మీడియానే పెద్దదిక్కు అయిపోయింది. అందుకే సెలబ్రిటీల ద్వారా మాట్లాడుతూ.. అనేక విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా లాక్డౌన్ లో ఉన్నటువంటి నటి రేణుదేశాయ్ తన అభిమానులతో లైవ్ కార్యక్రమంలో ముచ్చటించారు. లైవ్ లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబిచ్చారు. ఈ సందర్బంగా చాలా విషయాలకు ఆమె ఎలాంటి మొహమాటం లేకుండా సమాధానాలు చెప్పేసింది. రేణుదేశాయ్ ఏదైనా మొహం మీదే చెబుతారనే విషయం తెలిసిందే. అందుకే తాజాగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు అంతే సూటిగా సమాధానం చెప్పింది.

కరోనా సమయం - పాండమిక్ గురించి చాలా స్పందించిన అనంతరం రేణుదేశాయ్ కి రెగ్యులర్ గా ఎదురయ్యే ప్రశ్న ఎదురైంది. ఇదివరకు ఆ విషయం పై స్పందించలేదని ఫ్యాన్స్ ఈసారి కరోనా టైంలో కూడా అదే విషయం అడగటంతో రేణు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రేణుదేశాయ్ దంపతులకు అకిరా - ఆద్య అనే పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే అకిరాని పవర్ స్టార్ ఫ్యాన్స్ జూనియర్ పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. మరి ఇంతకి రేణుకు ఎదురైనా ప్రశ్న ఏంటంటే.. టాలీవుడ్ లో అకిరా డెబ్యూ ఎప్పుడు..? అని అడిగారు. అయితే రేణు ఇదివరకు పవర్ స్టార్ అనేది తన కొడుక్కు అవసరం లేదని.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు రావాలని.. ప్రస్తుతం అదే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపింది. అకిరా ఓ మరాఠీ చిత్రంలో న‌టించాడు. రేణు దేశాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ 'ఇష్క్ వాలా లవ్' సినిమాతో అకిరా తెరపై కనిపించాడు.

మరి తెలుగులో డెబ్యూ ఎప్పుడని ఎప్పటినుండో ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి. అకిరా నంద‌న్ ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేయాల‌ని ద‌ర్శ‌కనిర్మాత‌లు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంకా ఈ టాపిక్ అయిపోలేదంటూ ఫ్యాన్స్ మళ్లీ ప్రస్తావించేసరికి అసలు విషయం చెప్పింది. నిజానికి మెగాఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలు వచ్చినా ఆదరించడానికి మెగా అభిమానులు సిద్దంగా ఉంటారనేది విదితమే. ఇలాంటి సమయంలో అకిరా నందన్ సినీ ఎంట్రీ పై గతేడాది కాలంగా అనేక వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అలా అడిగిన ప్రశ్నకు సమాధానంగా రేణుదేశాయ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం అందరం కరోనా కారణంగా ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఇలాంటి సమయంలో అకిరా డెబ్యూ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆ విషయం మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని స్ట్రాంగ్ గా చెప్పేసింది. అలాగే తన పిల్లలతో పాటుగా అందరి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని ఆమె సూచించింది.