Begin typing your search above and press return to search.
రేణు దేశాయ్ సర్ ప్రైజింగ్ కామెంట్
By: Tupaki Desk | 11 Jun 2016 9:32 AM GMTతన మాజీ భర్త పవన్ కళ్యాణ్.. తన పిల్లల గురించి మాత్రమే కాదు.. తరచుగా సోషల్ ఇష్యూస్.. హాట్ టాపిక్ గా నిలుస్తున్న అంశాల గురించి కూడా తన ట్విట్టర్.. ఫేస్ బుక్ అకౌంట్లలో స్పందిస్తూ ఉంటుంది రేణు దేశాయ్. తాజాగా ఆమె ఫోకస్ అమెరికా ఎన్నికల మీద పడింది. అమెరికాలో తొలిసారి ఓ మహిళ అధ్యక్ష పదవికి రేసులో నిలవడం మీద ప్రపంచమంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రేణు దేశాయ్ మాత్రం అందరి అభిప్రాయాలకు విరుద్ధంగా రెస్పాండయింది. హిల్లరీ అధ్యక్ష రేసులోకి రావడంలో ఆశ్చర్యమేముంది అని ప్రశ్నించింది రేణు.
‘‘నాకైతే ఇదేమీ పెద్ద ఆశ్చర్యం కల్గించడంలేదు’’ అని ట్వీట్ చేసింది రేణు. ‘‘ఇప్పటిదాకా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన అమెరికాలో ఓ మహిళ అధ్యక్ష పీఠాన్ని అధిష్టించలేదు. ఐతే చాలా దేశాలు ఈ ఫీట్ ను ఎప్పుడో దాటేశాయి. చిన్న దేశాల్లో ఇది సాధ్యమైనపుడు పెద్ద దేశంలో ఇలా జరగడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏముంది’’ అని ఆమె పేర్కొంది. రేణు అన్నట్లు ప్రపంచంలో చాలా వెనుకబడిన దేశాలు కూడా మహిళను తమ పాలకురాలిగా ఎన్నుకున్నాయి. అమెరికా కంటే చాలా వెనుకబడ్డ భారత్ మూడు దశాబ్దాల కిందటే ఇందిరా గాంధీని ప్రధానిని చేసింది. పొరుగు దేశాలు శ్రీలంక.. బంగ్లాదేశ్ సైతం మహిళలకు పట్టం కట్టాయి. అలాంటిది.. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశమైన అమెరికా ఇప్పటిదాకా ఓ మహిళకు అవకాశం ఇవ్వకపోవడంపైనే ఆశ్చర్యపోవాలి.