Begin typing your search above and press return to search.

పవన్‌ లాగే ఆలోచిస్తున్న రేణు దేశాయ్‌

By:  Tupaki Desk   |   29 March 2020 6:10 AM GMT
పవన్‌ లాగే ఆలోచిస్తున్న రేణు దేశాయ్‌
X
పవన్‌ కళ్యాణ్‌ ఎంత పెద్ద స్టార్‌ అయినా.. ప్రముఖ రాజకీయ నాయుడు అయినా కూడా తన వ్యవసాయ క్షేత్రంలో ఆవులను కాస్తూ వాటికి మేత వేస్తూ పొలం పనులు చేస్తూ ఉంటాడు. ఆ పనిలోనే తనకు సంతృప్తి ఉంటుందని పవన్‌ కళ్యాణ్‌ అంటాడు. సిటీ శివారు ప్రాంతంలో పవన్‌ కళ్యాణ్‌ వ్యవసాయ క్షేత్రం ఉంటుంది. ఫ్రీ టైంను ఎక్కువగా అక్కడే స్పెండ్‌ చేస్తాడనే విషయం తెల్సిందే. అచ్చు పవన్‌ తరహాలోనే ఆయన మాజీ భార్య రేణు దేశాయ్‌ కూడా కోరుకుంటుంది.

పల్లెలు.. పల్లె వాతావరణంను మిస్‌ అవుతున్నట్లుగా తాజాగా సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ పెట్టింది. ఇటీవల ఒక కార్యక్రమంలో భాగంగా వికారాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని పల్లెల్లో పర్యటించిన రేణు దేశాయ్‌ అప్పుడు తీసిన వీడియో ఒకదాన్ని షేర్‌ చేసింది. ఆ వీడియోలో పిల్లలతో కలిసి రేణు దేశాయ్‌ ఎంజాయ్‌ చేస్తుంది. జంతువులు పక్షులకు చెందిన వీడియోలు ఫొటోలను కూడా ఈమె షేర్‌ చేసింది. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌ లో ఈ ఆనందకరమైన జీవితాన్ని మిస్‌ అవుతున్నాను అంటూ రేణు దేశాయ్‌ చెప్పుకొచ్చింది.

పిల్లలు పెద్దవారు అయ్యి కాలేజ్‌ కు వెళ్తున్న సమయంలో తాను పల్లెటూరుకు షిఫ్ట్‌ అవ్వాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. తన తదుపరి జీవితాన్ని కూరగాయలు పండిస్తూ చిన్న వ్యవసాయ క్షేత్రంలో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొంది. ప్రశాంత జీవితంను కోరుకుంటున్న రేణు దేశాయ్‌ ప్రస్తుతం పూణెలో పిల్లలతో కలిసి ఉంటున్న విషయం తెల్సిందే.

రేణు దేశాయ్‌ పోస్ట్‌ కు పలువురు పలురకాుగా కామెంట్స్‌ చేస్తున్నారు. మీ ఆలోచనలు అచ్చు పవన్‌ కళ్యాణ్‌ గారి ఆలోచనల మాదిరిగా ఉన్నాయి మీరు ఆయనలాగే ఆలోచిస్తున్నారు అంటూ కొందరు కామెంట్‌ చేశారు. మరికొందరు ప్రశాంత వాతావణం ఇప్పుడు పల్లెల్లో కూడా లేకుండా పోయిందంటూ కామెంట్‌ చేశారు. మొత్తానికి రేణు దేశాయ్‌ వీడియో ఇంకా ఆమె పల్లెటూరు జీవనం పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.