Begin typing your search above and press return to search.

ఏప్రిల్ 8 పవన్‌ కు ఎంత స్పెషల్ అంటే..

By:  Tupaki Desk   |   7 April 2016 10:35 AM GMT
ఏప్రిల్ 8 పవన్‌ కు ఎంత స్పెషల్ అంటే..
X
ఏప్రిల్ 8.. పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తేదీ. ఆ ఎదురు చూపులకు తెరపడటానికి.. ఆ తేదీ రావడానికి ఇంకొన్ని గంటలే మిగిలున్నాయి. సినిమా అంచనాలకు తగ్గట్లుగా ఆడితే ఏప్రిల్ 8ని జనాలు అంత సులువుగా మరిచిపోలేరు. ఐతే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఎలా ఆడినా సరే.. ఏప్రిల్ 8 అనేది పవన్ జీవితంలో చాలా ప్రత్యేకమైన తేదీ. ఎందుకంటే పవన్ కొడుకు అకిరా నందన్ పుట్టింది ఆ రోజే. రేపటితో అకిరాకు 12 ఏళ్లు పూర్తి కాబోతున్న సంగతి చాలామందికి తెలియదు. పవన్ తన కొడుకు పుట్టిన రోజును దృష్టిలో ఉంచుకునే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడో లేదో తెలియదు కానీ.. అకిరా బర్త్ డే.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రిలీజ్ డేట్ ఒకటే కావడం మాత్రం విశేషమే.

ఓవైపు ఉగాది పండగ.. మరోవైపు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రిలీజ్.. ఇంకోవైపు అకిరా పుట్టిన రోజు.. మొత్తానికి ఈ తేదీ పవన్ కు.. అతడి అభిమానులకు చాలా ప్రత్యేకమైన రోజు అనడంలో సందేహం లేదు. ఈ సందర్భంగా పవన్ మాజీ భార్య.. అకిరా తల్లి చాలా సంతోషంగా ఓ ట్వీట్ కూడా చేసింది. ‘‘ఏప్రిల్ 8.. హ్యాపీ బర్త్ డే అకిరా నందన్.. సర్దార్ గబ్బర్ సింగ్. పవన్ అభిమానుల సంబరాలు రెట్టింపు అవుతాయనడంలో సందేహం లేదు. మరి అకిరా తన తండ్రి సినిమాను ఎక్కడ చూడబోతున్నాడో’’ అని ట్వీట్ చేసింది రేణు. మరి అకిరా పుట్టిన రోజు నాడు విడుదలవుతున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.