Begin typing your search above and press return to search.
ఆ రీజన్ మరీ సిల్లీగా ఉంది రేణు గారు..!
By: Tupaki Desk | 30 Jan 2020 7:23 AM GMTపవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కి ఇప్పటికి కూడా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. తెలుగు ప్రేక్షకుల్లో ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎప్పటికప్పుడు ఉంటూనే ఉటుంది. ఆమె మళ్లీ నటిస్తే చూడాలని చాలా మంది అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే ఆమె రీ ఎంట్రీ గురించి ఆమద్య వార్తలు వచ్చాయి. రేణు దేశాయ్ నటించబోతుంది అనగానే అంతా కూడా ఏ సినిమా.. ఏ పాత్ర అంటూ ఆరాతీశారు... ఆ విషయమై నెట్ లో సెర్చ్ చేయడం కూడా జరిగింది. రేణు దేశాయ్ ఎంట్రీ గురించి ప్రేక్షకులు అంతటి ఆసక్తిగా ఉన్నారు.
ఇటీవల జరిగిన 'చూసి చూడంగానే' ప్రీ రిలీజ్ వేడుకలో రేణు దేశాయ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈ సినిమాలో నటించమంటూ రాజ్ కందుకూరి అడిగారు. ఆయన ఆఫర్ చేసిన పాత్ర నాకు నచ్చింది. కాని ఆ సమయంలో నాకు అనారోగ్యంగా ఉండటం వల్ల ఆ పాత్రను చేయలేనని చెప్పాను. ఆయన మరో సినిమా తీస్తే తప్పకుండా ఆ సినిమాలో నటించేందుకు నేను సిద్దంగా ఉన్నాను అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.
రేణు దేశాయ్ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. అనారోగ్యం కారణంగా ఆ పాత్రకు నో చెప్పాను అంటూ రేణు దేశాయ్ మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. ఆమె ఒప్పుకోవాలే కాని ఆమె ఆరోగ్యం కుదుట పడే వరకు నిర్మాత రాజ్ కందుకూరి వెచి చూసేవాడే. రేణు దేశాయ్ నటించేందుకు ఒప్పుకుంటే ఎన్ని నెలలు అయినా వెయిట్ చేయవచ్చు. ఆ విషయం రాజ్ కందుకూరి కూడా ఒప్పుకుంటాడు. కాని ఆమె ఒప్పుకోకుండా ఇప్పుడు అనారోగ్యం కారణం చెప్పి ఆ పాత్ర చేయలేక పోయాను అంటూ రేణు దేశాయ్ చెప్పడం ఏంటంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మీరు పాత్రకు నో చెప్పడానికి కారణం అంటూ మరీ సిల్లి రీజన్ చెప్పారు రేణు గారు అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.